ఉదాహరణకు మీరు ఇపుడు మీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పటికీ ఈ సమయానికి అనుగుణంగా ఉంటే సరిపోదు రానున్న రోజుల్లో ఆ నిర్ణయం వలన మీకు లాభం కలుగక పోయినా పర్వాలేదు. కానీ నష్టం మాత్రం ఉండకూడదు. అందుకే నిర్ణయం తీసుకునే ముందు అయినా, మాట అనేముందు అయినా సరే బాగా ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించండి అలాగే నిర్ణయాలు తీసుకోండి. ఆ పద్ధతే మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరువ చేస్తుంది.
అందుకే జీవితంలో మీ లక్ష్యం కోసం చేసే ఏ చిన్న పనిలో అయినా అలెర్ట్ గా ఉండాలి. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘాలోచన కలిగి ఉండడం ఉత్తమం. దీని ద్వారా ఒక వేళ ఏమైనా సమస్యలు వచ్చినా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అవగాహాన లేకుండా చేసే పనులు అలాగే తొందరలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని మీ లక్ష్యానికి దూరం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి, లేదంటే మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది.