ఇవన్నీ కలిసి వారి సామర్ధ్యానికి సంకెళ్లు వేస్తాయి. అలా పిల్లల్లో ఏదైనా సాధించగలం అనే దైర్యం కన్నా...అసలు మనం ఏదైనా చేయగలమా అన్న అప నమ్మకం ఏర్పడుతుంది. ఈ ఆలోచనలు అన్ని మీ పిల్లల విజయ దారిలో అవరోధాలు కలిగించి గమ్యాన్ని చేరుకోనివ్వకుండా అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలకు స్వేచ్చ ఇవ్వడం అవసరం, అలాగే వారి స్వేచ్ఛకు పరిమితిని కూడా వారికి సున్నితంగా తెలిసేలా చేయాలి. మంచి చెడుల విచక్షణ తెలుసుకునేలా చేయగలగాలి. అవగాహన పెంచాలి, సమర్థవంతమైన పౌరులుగా తీర్చి దిద్దాలి. సంఘంలో మీ పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉండేలా ప్లాన్ చేయాలి.
పిల్లల పై మీ ప్రభావం ఎక్కువగా పడకుండా జాగ్రత్తగా వారిని పెంచగలగలిగితే వారి జీవితంలో విజయాలను అందుకోవడంలో సఫలం అవుతారు. మీ బాధ్యత వారి వెంట నడుస్తూ ముందుండి మార్గాన్ని చూపడం మాత్రమే కాదు, వారికి కావాల్సిన చక్కని వాతావరణాన్ని సృష్టించడం కూడా అన్నది అర్దం చేసుకోవాలి. అయితే ఈ విషయాలను ప్రతి ఒక్క తల్లితండ్రులు గుర్తుంచుకుని వారిని విజయాన్ని అందుకోవడానైకి సరైన అవకాశాలను సృష్టించాలి.