మనిషికి పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఏదైనా పట్టుదలతో శోధించి సాధించాలి అన్నారు శ్రీశ్రీ. ఆ విధంగానే ఈ పిల్లాడు రికార్డు సాధిస్తున్నాడు. మరి ఏం సాధించాడో తెలుసుకుందామా..? ఈ బుడ్డోడి వయసు ఆరేళ్లు.ఆరేళ్ల వయసులో అనేక రికార్డులను సాధించాడు. ఇంతకీ ఎవరా ఆరేళ్ళ బుడ్డోడు..? ఏం ఘనత సాధించాడ..? మెరుపు వేగంతో దూసుకు వెళుతూ అనేక రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆరేళ్ళ వయసులోనే జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రథమ  స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించాడు. స్కేటింగ్ పోటీల్లో మన దేశానికి ఆశాకిరణంగా నిలుస్తున్నాడు  ఈ ఆరేళ్ల కృష్ణ నిక్షిత్.

 ఒలంపిక్స్ స్కేటింగ్ పోటీల్లో ఎప్పటికైనా మన దేశానికి పతకం తీసుకురావడమే తన లక్ష్యం అంటున్నాడు ఈ చిచ్చరపిడుగు. హైదరాబాద్ గాజులరామారంలో నర్సింగరావు, అనూష దంపతుల కొడుకు ఆరేళ్ల కృష్ణ నిక్షిత్. స్కెటింగ్ లో తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. నిజాంపేట్  లోని విజ్ఞాన్ బోట్రి స్కూల్లో ఫస్ట్  క్లాస్ చదువుతున్న ఈ చిచ్చర పిడుగు ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇన్నర్ స్పేస్ స్కేటింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో నిక్షిత్ ను పలువురు అభినందించారు. నిక్షిత్ కు రెండేళ్ల వయసు నుంచే స్కేటింగ్లో ట్రైనింగ్ ఇప్పించామని పేరెంట్స్ చెబుతున్నారు. కోచ్ గిరి, అధ్యాపకుల సహాయంతో  తమ కుమారుడు గోల్డ్ మెడల్ సాధించడం చాలా అనందంగా ఉందన్నారు.

భవిష్యత్తులో ఓలంపిక్స్ లో పాల్గొని దేశానికి పతకం తేవడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు. నిక్షిత్ లో చాలా టాలెంట్ ఉందని చెబుతున్నారు కోచ్ గిరి. ఆరేళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించాడు అంటే రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధిస్తాడన్నా నమ్మకం తనకుందని కోచ్ గిరి చెబుతున్నారు. అయితే ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తాను అని ఈ చిచ్చర పిడుగు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆడుకునే ఆరేళ్ళ వయసులోనే ఇన్ని రికార్డులు సాధించిన ఈ చిచ్చర పిడుగు రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: