చదువులో పూర్... కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌ లో మాత్రం స్థానం లభించింది. ఐసిసి ప్యానెల్‌ లో రిఫరీగా చోటు దక్కించుకున్న ఉన్న మొదటి భారతీయ మహిళ జిఎస్ లక్ష్మి... పురుషుల ఆధిపత్యం ఉన్న అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా పని చేసి కొత్త చరిత్ర సృష్టించిన భారత మాజీ మహిళా క్రికెటర్‌ జీఎస్‌ లక్ష్మి గురించి తెలుసుకుందాం.

జిఎస్ లక్ష్మి దేశంలోనే అత్యంత విజయవంతమైన దేశీయ మహిళా క్రికెట్ జట్టు రైల్వే తరపున ఆడింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోయినా 1999లో ఇంగ్లండ్‌లో పర్యటించిన మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. 1968 మే 23న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించిన లక్ష్మి జంషెడ్‌పూర్‌లో పెరిగారు. ఆమెకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. 1986లో పదో తరగతి పరీక్షలో మెరుగైన మార్కులు తెచ్చుకోలేక కాలేజీలో అడ్మిషన్ పొందడం కష్టంగా మారింది. ఆమెకు క్రికెట్ ఆటలో ఉన్న ప్రావీణ్యం ఆధారంగా స్పోర్ట్స్ కోటా నుండి ఆమెను చేర్చుకున్నారు. ఆమె తండ్రి లక్ష్మీ ఫాస్ట్ బౌలర్‌ అవుతుందని చెప్పి కళాశాల నిర్వాహకులను ఒప్పించారు.

కాలేజీ అడ్మినిస్ట్రేషన్‌కి తండ్రి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ జి.ఎస్. లక్ష్మి తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఫలితంగా ఆమెకు 1989లో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌కు వెళ్లింది. ఇక్కడి నుంచి రైల్వే జట్టుతో కలిసి ఆడడం ప్రారంభం చేసింది. 2004లో జిఎస్ లక్ష్మి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత లక్ష్మి కోచింగ్ వైపు మళ్లారు. దక్షిణ మధ్య రైల్వేలో సేవలను కొనసాగించారు. అప్పటి నుంచి లక్ష్మి 19 ఏళ్ల లోపు ఆటగాళ్లకు కూచ్ బెహార్ ట్రోఫీలో సేవలందిస్తోంది. 2008లో bcci దేశీయ క్రికెట్‌లో మహిళా రిఫరీలకు అవకాశం కల్పించడం ప్రారంభించింది. 2014లో bcci 120 మంది మ్యాచ్ రిఫరీల కోసం తొలిసారిగా అర్హత పరీక్షను నిర్వహించింది. అందులో పురుషుల దేశవాళీ మ్యాచ్‌లలో సేవలందించేందుకు లక్ష్మితో సహా 50 మంది రిఫరీలను ఎంపిక చేసింది. ఆమె మహిళలకు మూడు వన్డేలు, t20 మ్యాచ్‌లలో రిఫరీగా వ్యవహరించింది. మహిళల టీ20 ఛాలెంజ్ మ్యాచ్‌లో నాలుగు మ్యాచ్‌లకు కూడా ఆమె రిఫరీగా వ్యవహరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: