
ఒక విద్యార్థికి ప్రతి తరగతిని పూర్తి చేసుకుని తదుపరి తరగతి వెళ్లాలో అనేది ప్రతి సారి వచ్చే లక్ష్యం. ఆ తర్వాత కాలేజ్, ఉద్యోగం ఇలా లక్ష్యాలు అనేవి ఎప్పటికప్పుడు నిర్దేశించుకోవాలి. నిజానికి ఈ సమాజం నిర్దేశించింది. అయితే వాటి ప్రకారం మనం కూడా ఫాలో అయితే మనకు మంచే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా అలానే ఉండాలి అని లేదు మీలో కనుక ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నా, మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న దారిలో వెళ్లి మీకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అందరి ముందు విజయాన్ని అందుకున్న వ్యక్తిగా మిమ్మల్ని మీరు గర్వంగా ప్రూవ్ చేసుకోవచ్చు.
కాబట్టి మీ జీవితం పట్ల ఒక భయం, బాధ్యత కలిగి ఉండి ముందుకు వెళితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అంతే కానీ జీవితం అంటే నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే ఎందులోనూ ముందుకు వెళ్ళ లేరు. అందుకే మీరు తల పెట్టే ప్రతి చిన్న పనిలోనూ క్రమశిక్షణతో ప్రణాళికను చేసుకుని కార్యాన్ని తల పెడితే సక్సెస్ సాధించ గలరు. అందుకే మీ విజయానికి అవసరం అయిన ప్రతి ఒక్క అంశాన్ని సరిగా ఉపయోగించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ ను అందుకోవాలి.