మనం సమాజంలో నివశిస్తున్నాం ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, ఒకప్పటి కాలంలో సమాజం వేరుగా ఉంది, ఇప్పటి మోడ్రన్ కాలంలో సమాజం వేరుగా ఉంది. అప్పటి కాలంలో ఇపుడు బ్రతుకుతాం అంటే జరగదు, జీవితంలో ముందుకు సాగలేం. అందుకే ఇక్కడ మానసిక వికాసం అనేది చాలా అవసరం. ఎవరైనా ఉద్యోగం తెచ్చుకున్నారు అంటే చాలా సింపుల్ గా అది వాళ్ళ అదృష్టం అంటుంటారు చాలా మంది, కానీ కేవలం అదృష్టం వలన జరిగేది కాదు అందు కోసం వారి ప్రయత్నం, దాని వెనుక వారి కష్టం ఎంతో దాగి ఉంటుంది. అహర్నిశలు కష్టపడి అందు కోసం సన్నాహాలు చేసి ఉంటారు.
అయితే అందుకు కాస్త అదృష్టం తోడైతే విజయం మీ సొంతం అవుతుంది. అంతే కానీ మీ ప్రయత్నం లేకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎలా? మానసిక వికాసం కొరకు మంచి ఆలోచనలు, విద్య, స్నేహితులు, తల్లి తండ్రుల ప్రభావం, సమాజంలో జరిగే మంచి చెడ్డలు తెలుసుకోవడం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అన్ని విషయాలను సమ పాళ్లలో అర్ధం చేసుకుని ముందుకు వెళితేనే ఇందులో అయినా విజయాన్ని సాధించగలరు. కాబట్టి ఇప్పటి వరకు పైన చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకుంటేనే మీరు జీవిస్తున్న ఈ జీవితానికి ఒక అర్ధం ఉంటుంది.