జీవన మార్గంలో మన వారు, మన తోబుట్టువులు, బందువులు కాకుండా ఎందరో కలుస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అయితే ఎవరు మన మనసుకు దగ్గరవుతారో వారు మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోతారు. మనం వారిని అభిమానించడమే కాదు మనల్ని కూడా వారు అంతగానే అభిమానిస్తేనే ఆ బంధం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది. వారి కష్ట సుఖాలు మనవుతాయి, మన సుఖ దుఃఖాల్లో వారు తోడుగా వుంటారు. అలాగే మన ప్రతి విషయం లోనూ మనకు తోడుగా, అండగా నిలబడతారు. మనీని గెలుచు కోవడం కాదు మన అనుకున్న వారి మనసు గెలుచు కోవడం కూడా విజయమే అవుతుంది.

మరి ఆ విజయం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. ప్రస్తుతం మారుతున్న కాలంలో మానవ సంబంధాలు కన్నా మనీ సంబందాలకే విలువ పెరుగుతోంది. క్రమంగా ఈ కరెన్సీ అనే వైరస్ వ్యాప్తి నలు మూలలకు పాకుతోంది. ఈ కంటికి కనిపించని మహమ్మారి మనలోని మానవత్వాన్ని చంపుతుంది. ఇది పోను పోను మనషుల మనుగడపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకప్పుడు ఏ బంధుత్వం లేని వారిని సైతం బంధాలతో పిలుస్తూ మన అనుకుని వారి కోసం ఎంతో చేసేవారు. పూర్వంలో ఉన్న ప్రేమానుబంధాలు ఇప్పుడు పెద్దగా కనపడటం లేదు. ఇకనైనా మార్పు మళ్ళీ మొదలు కావాలి.

మనమంతా మనుషులం మన అందరికీ ఒకరి కొకరు కనిపించని బంధాలతో ముడి పడి ఉన్నారు ఆ విషయాన్ని అర్దం చేసుకుని  ఒకరి నొకరు కలుపుకు పొండి. కనీసం మీ మనసుకు దగ్గరయిన వారితో అయినా చివరి వరకు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ దగ్గర ఉన్న డబ్బు ఆస్తులు ఏవీ కూడా మనుషుల్ని సంపాదించ లేవు. కేవలం మంచి, మానవత్వమే నలుగురిని మీకు అందిస్తుంది. మిమ్మల్ని కల కాలం కాపాడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: