మామూలుగా మన లైఫ్ లో భాగంగా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఈ సంఘటనలకు కారణం అయిన మనుషులు చాలా విచిత్రమైన వారు అని చెప్పాలి. ఎందుకంటే మాములుగా మనకు వివిధ పరిస్థితులలో అనేక మందితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అందులో కొన్ని పరిచయాలు మనము జీవితాంతం ముడి పడి ఉంటాయి. మరికొన్ని పరిచయాలు మాత్రం మధ్య లోనే ఆగి పోతాయి. అయితే పరిచయము ఏదైనా ఎవరితో అయినా మనము మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకు జాగ్రత్త అనాల్సి వస్తుంది అంటే... అందరూ ఒకేలాగా ఉంటారని గ్యారంటీ లేదు.
కొందరు మీతో బాగా ఉంటూనే మీ నాశనం కోరుకుంటూ ఉంటారు. మరి కొందరు మీతో ఉంటూనే మీకు దగ్గర వాటిని దూరం చేస్తూ ఉంటారు. ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. కొన్ని ఇబ్బందులు అయితే తట్టుకుని నిలబడగలము. కానీ కొన్ని సార్లు మానము ఊహించ లేని మరియు జీవితంలో తిరిగి కోలుకోలేని విధంగా ఇబ్బందులు జరుగుతాయి. అయితే అంత వరకు తెచ్చుకోవడం దేనికి ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం మీ తోటి వారితో నడుచుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
అయితే ఇప్పుడు ఎలా ఉండాలో చూద్దాం...
ముందుగా మీతో పరిచయం అయి స్నేహం చేసే వారి గురించి కొన్ని రోజులు తీక్షణంగా పరిశీలించండి... వారు వ్యవహరించే విధానం మాట్లాడే తీరును బట్టి మీకు వారి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మీకు సంబంధించిన అన్ని విషయాలను వారితో చెప్పేయకండి. మిమ్మల్ని వారు అడిగే ప్రశ్నలు బట్టి కూడా వారి గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ పైన చెప్పిన విధంగా కాకుండా గుడ్డిగా నమ్మారో... ఇక అంటే మీరు తల పెట్టిన ఎటువంటి పని లేదా లక్ష్యం నాశనం అయిపోతుంది. కాబట్టి గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండండి...
మరింత సమాచారం తెలుసుకోండి: