* ఆన్లైన్ షాపింగ్
ఆన్లైన్ లో షాపింగ్ కి అలవాటు పడితే తరచూ ఆన్లైన్ లో బిజీ అయిపోయి అవే యాప్ లను చూస్తూ అందులో కనిపించే వాటిని చూస్తూ ఉంటాం. అలా చూడటం వలన ఖచ్చితంగా ఒకటో రెండో బాగా నచ్చుతాయి. పెద్దగా అవసరం లేకపోయినా అవి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, తద్వారా ఆన్లైన్ షాపింగ్ లో డబ్బులు అనవసరంగా ఎక్కువగా ఖర్చు చేస్తాము.
* ప్రయాణ ఖర్చులు
అలాగే స్నేహితుల ప్రోద్బలం వలన అవసరం లేకపోయినా అక్కడకు ఇక్కడకు వారానికి కనీసం ఒకసారైనా దూర ప్రయాణాలకు వెళుతుంటారు. దీని వలన మీకు కనీసం వారానికి 2000 ఖర్చు అయినా, నెలకు 8000 అనవసరంగా ప్రయాణాలు చేయడం వలన కూడా తెలియకుండానే డబ్బు ఖర్చు అయిపోతుంది. అదే విధంగా చాలా అనవసరమైన ఖర్చులు మనల్ని ఆర్దికంగా కరగదీస్తాయని గుర్తుంచుకోండి.
* అనవసరమైన ఖర్చులు
అంతే కాకుండా నిండా అవసరం అనిపిస్తే తప్పించి డబ్బులను ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మీకు జీవితంలో ఆర్ధికంగా కష్టాలు వచ్చినా సర్దుకోగల సత్తా వస్తుంది.
* ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ చేయడం
టౌన్ లో నివసించే వారు ఇంట్లో ఆహారం తినడమే గగనం. నిత్యం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. ఇలా చేయడం వలన డబ్బులు నష్టపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.
వంటి 4 అలవాట్ల వలన మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఇట్టే ఖర్చు చేసి మరీ వృదా చేసుకుంటాం.