సంతోషం లేని జీవితం విజయం అందుకున్నా వ్యర్థమే అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి సహజమే. ఎంత దనువంతుడైనా ఎంత నిరుపేద అయినా ఏ చెట్టుకు ఆ గాలి అన్నట్లుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే అవన్నీ కూడా జీవితంలో ఒక భాగమే, సంతోషం అయినా, బాధ అయినా ఏది అయినా శాశ్వతం కాదన్న విషయాన్ని కాస్త అర్దం చేసుకోగలిగితే మనిషి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అందరూ తమ తమ లక్ష్యాలు వైపుగా పరుగులు తీస్తుంటారు. నిజానికి ఉరుకులు పరుగులతో పయనించే కాలమిది. అయినప్పటికీ మనిషి తన చిన్న చిన్న సంతోషాలను వదిలి ఉరకలు వేయరాదు.

అంతకు మించిన సంతోషం వైభవం కావాలంటూ పరుగులు తీయడం,మంచిది కాదు. ఇదే మన దుఃఖానికి ప్రధమ కారణం అవుతుంది. సమస్యలు తలెత్తడానికి ఎక్కువగా కారణం అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రోజు రోడ్డుపై నిలబడి ఒక తోపుడు బండిపై  ఎండనక, వాననక ఎంతో కష్టపడి సంపాదించేవాడు, అతడు అలా ఎంతో కష్టపడి పోగేసిన డబ్బులను ఏ మాత్రం తన కుటుంబ అవసరాలకు వినియోగించకుండా, అంతే శ్రమించి ఆ డబ్బును రెట్టింపు చేసి చిన్నగా ఒక షాపు పెట్టుకుని పండ్ల వ్యాపారం మొదలుపెట్టాడు. మళ్ళీ అలా కష్టపడగా వచ్చిన డబ్బులను అంటీముట్టనట్టుగా ఇంటి ఖర్చులకు కానీ కుటుంబ సభ్యుల ఖర్చులకు కానీ వినియోగించకుండా ఉంటాడు అణువునుండి.

ఆ తర్వాత ఇంకా తన వ్యాపారాన్ని పెంచుకోవాలనే వ్యామోహంతో కాలంతో పరుగులు తీస్తున్నాడే తప్ప విరామం లేదు, చిన్న చిన్న సంతోషాలు కూడా లేవు. అదే విధంగా తన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా లేరు.. అలా తన శ్రమకి ఆశకి హద్దంటు లేక కొనసాగుతూనే ఉంది. దీని వల్ల అతడికి వరుసగా విజయాలు అందుతున్నాయి. కానీ ఆ విజయం వలన వచ్చే సంతోషాన్ని ఆశ్వాదించలేకపోతున్నాడు. కాబట్టి కష్టపడగా వచ్చిన ఫలితాన్ని పొందితేనే మీకు కష్టం విలువ తెలుస్తుంది. సో కష్టపడండి ఆ ఫలితాన్ని మీ సంతోషం కోసం ఉపయోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: