కానీ వారికంటూ ఒక జీవితం మొదలయ్యాక ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అస్సలు తట్టుకోలేరు. అలాంటప్పుడు వారు వాటిని అధిగమించి ముందుకు సాగడానికి చాలా కష్ట పడాల్సి ఉంటుంది, చాలా వరకు అసాధ్యం అవుతుంది, అప్పడు వారు ఎలా తమ లక్ష్యాలను చేదిస్తారు ? ఎలా తమ ముందు నిలిచిన సవాళ్ళను ఎదుర్కోగలరు ? కనీసం ఆ కష్టాలను తట్టుకోగలరు అంటే చాలా కష్టమే. అందుకే పిల్లలకు చిన్నతనం నుండే తమ పనులను తాము చేసుకోవడం, చిన్న చిన్న లక్ష్యాలను ఎంపిక చేసుకుని వాటిని సవ్యంగా పూర్తి చేయడానికి ప్రయత్నించమనడం వంటివి చేయాలి. అపుడే వారికి అన్ని అలవాటు అవుతాయి .
పిల్లలపై ప్రేమ ఉండడం, వారికి సౌలభ్యమైన జీవితాన్ని ఇవ్వడం ముఖ్యమే మరియు అవసరమే. అలాగని జీవితంలో ఏ సమయంలో ఎలా ఉండాలి అనేది నేర్పించకపోతే, మీరు ఇచ్చిన జీవితానికి అర్ధమే ఉండదు. అందుకే సౌకర్యాలతో పెంచడం తో పాటుగా, ఆ సౌకర్యాల విలువ తెలియచేయడం వాటిని సమకూర్చుకోవడంలో మెళుకువలు అన్నిటినీ నేర్పించాలి, తెలియచేయాలి. అప్పుడే ఒక పేరెంట్ గా మీరు సక్సెస్ అయినట్లు.