మనిషికి మంచి జరగడానికి అవసరమైన అన్ని లక్షణాలు అందరిలో ఉండవు. అయితే ఇలాంటప్పుడు ఇబ్బంది లేదు. కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది. ఉదాహరణకు స్వార్దం, అత్యాశ మీకు చేరువ కావలసిన మీకు దక్కాల్సిన విజయాన్ని మీకు అందకుండా చేస్తుందన్న విషయం మీకు తెలుసా ? ఒక వ్యక్తి చాలా తెలివైన వాడు, చదువులోనూ, క్రీడల్లో, ప్రత్యేక నైపుణ్యాలలోనూ ఇలా అన్నిటిలో ఎపుడు ముందుండే వాడు. కానీ అతని లోపం మాత్రం అతడి అత్యాశ అందరి కన్నా బాగా చదవాలని, చదివి మార్కులు తెచ్చుకుంటే అది పోటీతత్వం అవుతుంది. కానీ తనకన్నా ఎవరు బాగా చదవకూడదు, తనకు మించి మార్కులు, మంచి పేరు తెచ్చుకోకూడదు అని అనుకుంటే అది స్వార్దం, అత్యాశ అవుతుంది.

అలా చేయడం వలన అప్పటికి మీకు మిన్నగా మార్కులు వస్తాయేమో, కానీ అదే ఫీలింగ్ ను కంటిన్యూ చేస్తూ పోతే ఆ భావాలు మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తాయి. మిమ్మల్ని  లక్ష్యానికి దూరం  చేస్తాయి. మీరు గెలవాలి అనుకోవడంలో తప్పు లేదు, మిగిలిన వారంతా ఒడిపోవాలి.. మరెవరూ గెలవకూడదు అనుకోవడం తప్పే అవుతుంది. ఇటువంటి స్వార్దం, అత్యాశ భావాలు కలిగిన వారు జీవితం లో బాగు పడినట్లు ఎక్కడ లేదు. ఇవి మనిషి మనోభావాలను లొంగ దీసి జీవితాలపై దెబ్బకొట్టి ఒక్క సారిగా కుంగిపో యేలా చేస్తాయి.

అందుకే చిన్న తనం నుండే మీ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పండి. విలువలు, బాధ్యతలు గురించి తరచూ చెప్తూ ఉండండి. మీలో కనుక ఈ లక్షణాలు ఉంటే వాటిని విడిచిపెట్టండి. ఒక్క సారిగా ఆ పని చేయలేకపోతే నెమ్మది నెమ్మదిగా ఈ గుణాలను ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటి వలన నష్టం మీకు మాత్రమే కాదు మీతో ఉన్న వారికి కూడా కష్టమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: