పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలక. కానీ ప్రస్తుత కాలంలో తల్లితండ్రులు తమ తమ పనుల వల్ల పిల్లలను పట్టించుకోవడమే కాదు, వాళ్లు ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? అనే విషయాన్ని కూడా పట్టించుకోవటం లేదు. దీని ప్రభావం పిల్లలపై ఎక్కువ గానే పడుతుందని చెప్పుకోవచ్చు. అందుకు కారణాలు లేకపోలేదు ప్రస్తుతం మన కళ్ళ ముందు జరిగే ఎన్నో దారుణాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఇదిలా ఉంటే కొంత మంది తల్లితండ్రులు తమ అతి గారాభం వల్ల కూడా పిల్లలు చెడుకి ప్రభావితులు అయ్యేలా కారకులు అవుతున్నారు. కానీ మన పిల్లలు భాద్యతగా పద్ధతిగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా మంచిగా పెరగాలి అంటే తల్లితండ్రులు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అలాగే పిల్లలతోను వాటిని పాటించేలా చెయ్యాలి. అప్పుడే వారు మంచి ఏదో చెడు ఏదో తెల్సుకుని నలుగురిలో గౌరవంగా ఉండగలరు. దానికోసం తల్లితండ్రులు ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెల్సుకుందాం.

* తల్లితండ్రులు తమ పిల్లలపై ఇష్టం, ప్రేమ పెంచుకోవడమే కాదు, వారికి కొన్ని పనులు నేర్పించి వారు భాద్యతగా ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా  ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పనులు కూడా మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి.

* పిల్లలు ముందుగా తమ తోడపుట్టిన వాళ్ళతో ప్రేమగా ఉంటూ వారి మధ్య తేడాలు రాకుండా ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా ఒకరి మీద ఒకరికి హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి.

* మనకి సమయం  దొరికినప్పుడల్లా వారికి కొత్త ప్రదేశాలను అలాగే కొత్త వ్యక్తులను పరిచయం చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి తెలియని విషయాలను గురుంచి వివరంగా చెప్తూ ఉండాలి. ఇలా చేయటం వలన పిల్లలలో ఇంకా తెల్సుకోవాలి అనే కొత్త ఉత్సాహం వస్తుంది.

* అలాగే  కొత్త కొత్తగా ప్రశ్నలు అడుగుతూ వాటికి పిల్లలు సమాధానాలు చెప్పటానికి మన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఇలాంటి సమయంలో పిల్లలకి  వచ్చే అనేకమైన సందేహాలకు మనకు చేతనైనంత వరకు సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించాలి.

* ఇంకా 6-7 సంవత్సరాల వయస్సు వరకు వారు చూసిన,  అలాగే విన్న ప్రతి విషయం వారి యెక్క మెదడులో అలాగే గుర్తుండిపోతుంది. దాని పరిణామం పిల్లల యొక్క భవిష్యత్తు మీద పడుతుంది . ఇలాంటి సమయంలోనే తల్లితండ్రులు పిల్లల మీద కోపం చూపడం కానీ, లేదా వారిపై పెద్ద పెద్దగా అరవటం వంటి  పనులు అసలు చేయకూడదు.

* మన పిల్లల యొక్క శక్తి సామర్థ్యాల్ని మనమే ఒక  అంచనా వేసుకుంటూ అలాగే పిల్లల యొక్క  బలాలు మరియు బలహీనతలను తెలుసుకుని పిల్లలు ఎక్కువగా దేనిని అయితే ఇష్టపడతారో వాటి మీదనే పిల్లకి ఆసక్తి కలిగేలా చేయాలి.

* ఇంకా పిల్లలు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆలోచనలకి మించి తీవ్రంగా ఆలోచించేలా తల్లితండ్రులుగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. ఇలా వారు చిన్న తనంలోనే ఒత్తిడికి గురైతే అది వారి భవిష్యత్తు పై ప్రభావం చూపుతుంది. దాని వల్ల వారు రానున్న కాలంలో అనుకున్నంతగా ఎదగలేరు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

* అలాగే పిల్లల్లో కొత్త కొత్త  ఆలోచనలు వచ్చేందుకు మన వంతు  ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి. అంతే కాకుండా పిల్లల యొక్క ఆలోచనలు ఆచరణలో పెట్టేందుకు కూడా మన వంతు  సహాయాన్ని అందించాలి.

*పిల్లలు మంచి పనులు చేసినప్పుడు వారిని మనం మంచి మనసుతో మనస్ఫూర్తిగా అభినందించాలి. అలాగే పిల్లలకు ఇష్టమైన చిన్న చిన్న బహుమతులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు తాము అనుకున్న గమ్యాలకు చేరుకుంటూ చెడు దగ్గర కాకుండా మంచిగా ఎదుగుతారు.

పిల్లలు మంచి మార్గంలో పెరిగి, వారు పెద్దయ్యాక వారి వలన ఎవ్వరికీ చెడు జరగనప్పుడే ఒక తల్లితండ్రులుగా మనం సక్సెస్ అయినట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: