
ఈ ఉద్యోగాలలో అధికంగా 10 శాతానికి పైగా ఉద్యోగాలు గ్రూప్ 4 ఉద్యోగానికి సంబంధించినవి ఉండటం విశేషం. విడుదలైన మొత్తం 80 వేల ఉద్యోగాల్లో 9168 గ్రూప్ 4 ఉద్యోగాలున్నాయి. అయితే ఇప్పటి నుండే పట్టుదలతో ప్రిపరేషన్ మొదలు పెడితే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అందుకు కావాల్సిందల్లా ముందుగా మీ ప్రయత్నమే !
మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించడం కోసం అందుకు సంబందించిన సిలబస్ ను తెలుసుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఖచ్చితంగా టైం టేబుల్ ను ప్రిపేర్ చేసుకోండి. ప్రణాళిక బద్దంగా చదవడానికి సమయాన్ని కేటాయించండి. మీ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏకాగ్రతతో మనసును చదువుపై లగ్నం చేసి అర్దం చేసుకుంటూ చదవండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఎప్పుడూ కరెంటు అఫైర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి డైలీ అందుకోసం ఒక నోట్ బుక్ పెట్టుకుని అన్ని విషయాలను కలెక్ట్ చేసి అప్పుడప్పుడూ రివిజన్ చేసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. మీరు చదువుకున్న మరియు నేర్చుకున్న విషయాలను మీకు మీరే అప్పుడప్పుడు ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టుకుంటూ ఉంటే మెయిన్ పరీక్షలో మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.