ప్రస్తుత కాలంలో ప్రపంచం విజేతలను మాత్రమే  గుర్తుపెట్టుకుంటుంది. ప్రపంచం పరాజయం పొందిన వారిని  గురించి అసలు పట్టించుకోదు. అందువల్లనే అందరూ కూడా విజయం పొందడానికే తమ వంతు ప్రయత్నంగా పరుగులు పెడుతుంటారు. అయితే విజయాన్ని పొందాలి అంటే మన  మనసుల్లో కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం ఆ విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాము.

ముందుగా  మనం ఇక్కడ ఒక విషయం తెల్సుకోవాలి.మనం భూమిలో నారింజ గింజను నాటి దాని స్థానంలో ఆపిల్ చెట్టు కోసం  ఆశ పడితే లాభం ఏమి ఉండదు. అలాగే  మనం దేనినైతే కొరుకుంటామో దానికి తగినవిధంగానే మన పనులు కూడా ఉండాలి. మనం ఎంత  పెద్ద విజయాన్ని  కావాలనుకుంటామో దనికింతగ్గట్టుగానే మనం  పని చేయాల్సి ఉంటుంది.

అహం కారంగా ఉన్నట్లయితే అది మనల్ని దెబ్బతీస్తుంది. అందువల్ల మనం జీవితంలో అహన్ని విడిచిపెట్టాలి. ఇది మనం జీవితంలో ముందుకు వెళ్లకుండా చేస్తుంది.అందువల్ల అహాన్ని మాత్రం నిర్దాక్షణ్యంగా వదిలి వేయాలి. ఈ  విషయాన్ని మాత్రం విజేతలు బాగా గుర్తుంచుకోవాలి.

మనం ఒక పని చేయటం వల్ల మనకి ఏమి వస్తుంది అని కాదు.మనం  ఆ పని  చేయటం వల్ల మనం ఎలా ఉంటునము అనేది  బాగా ఆలోచించుకోవాలి. అలాగే మనం ఆ పని వల్ల తప్పు దార్లోకి వెళ్లే  అవకాశం ఉంటే మనం దాని జోలికి వెళ్ళకపోవడమే మరి మంచిది.

అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా  నిరాశను మన చెంతకి  రానివ్వకుడదు.  అలా కాదని రానిస్తే అది మనలో తిష్ట వేసుకుని కూర్చొని మనము ముందుకి పోకుండా చేస్తాయి. అందువల్ల మనం వాటికి ఎట్టి పరస్థితుల్లోనైనా స్వాగతం చెప్పారే అనుకోండి అవి  మనం ముందుకి వెళ్లనివ్వవు.

ఇక ఒక విషయం  వలన మనకి నాలుగు లేదా ఐదు సంవత్సరాల తర్వాత కూడా దానితో మనకి పని లేకపోతే మనకిన్ దాని అవసరం ఎప్పుడూ కూడా ఉండదు. ఎందుకు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచిస్తూ మనం మన విజయం గురుంచి ఆలోచించలేము.

అలాగే మనం సంతోషాన్నిచ్చే పనులు కనుక చేసినట్లయితే ప్రజలు మనకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకు అంటే సంతోషంగా నవ్వే వారి దగ్గరకే నలుగురు వచ్చి చేరుతారు. ఏడుస్తూ ఉండిపోతే ఈ ప్రపంచం కూడా మనల్ని  అలాగే వదిలేస్తుంది.అందువల్ల ఒకవేళ మనకి ఎప్పుడన్నా దుఃఖం వచ్చినా కూడా  ఆ దుఃఖం మనలని మరింతగా ఎక్కువగా బాధపడేలా చేస్తుండే కానీ తగ్గించదు.

చూశారు కదా మనం మన పనిలో విజయం సాధించాలి అనుకుంటే మనం కచ్చితంగా పైన చెప్పిన విధంగా చేసినట్లైతే కచ్చితంగా విజేతలు అవుతాము.

మరింత సమాచారం తెలుసుకోండి: