ముందుగా మనం ఏ పని చేయాలి అన్న మన మీద మనకి నమ్మకం ఉండాలి.ఆ నమ్మకమే లేకపోతే   ఏ పనీ మొదలు పెట్టాలని, అలాగే మొదలు పెట్టిన పనిని పూర్తి చేయలేము. ఏదైనాఈ పనిని అయిన చేద్దామనుకున్నప్పుడు ముందుగా మన వల్ల కాదేమో అన్న  అనుమానం వచ్చి అది మన వల్ల కాదు  చేయలేము అన్న ఫీలింగ్ ని మనకి తెప్పిస్తుంది. దానివల్ల మనం  చేయాలనుకున్న పనిని పూర్తి చేయలేము. ఒక్కో సారి మన మీద  నమ్మకం పోవడానికి బయట పరిస్థితులు కూడా ఒక కారణం అవుతుంటాయి. ఆ పరిస్థితులు ఏంటో తెలుసుకుని, మనం  కూడా ఇతరుల పట్ల అలా ఉంటున్నామా? లేక మన పట్ల ఎవరైనా అలా ఉండడం వలన మనలో ఆత్మ విశ్వాసాన్ని తగ్గిస్తున్నారా? అనేది చెక్ చేసుకోవాలి.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం

మనం ఎదుగుతున్న సమయంలో తల్లిదండ్రుల పాత్ర మన మీద చాలానే  ఉంటుంది. అటు వంటి సమయంలో మన పట్ల నిర్లక్ష్యం వారి ప్రవర్తన ఆత్మన్యూనతకి దారి తీస్తుంది.మనం ఏదైనా చెప్పాలి, లేదా వినాలి అనుకున్నపుడు ఎవరో ఒకరు మనతో లేకపోతే  ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.

తల్లిదండ్రుల అంగీకారం దొరక్కపోవడం

మనం ఏదైనా చేద్దామనుకున్నపుడు వద్దని, అలాగే  దానివల్ల నష్టాలు కలుగుతాయని మనం  పదే పదే చెబుతూ ఉండడం వలన కూడా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వారు ఏది చెప్పినా  నా వల్ల కాదంటున్నారు, నా వల్ల నిజంగానే ఏదీ కాదనే విశ్వాసం వారిలో పెరుగుతుంది. అందుకే కొన్ని సార్లు మనం చేసే పనుల వల్ల నష్టం వస్తుందని తెలిసినా కూడా ఆ పనిని అలా వదిలివేయడం చాలా మంచిది.

అభద్రతాభావం
ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే వరిని అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి అనే భావనలు వాల్లాల నేను లేనే అనే  భావం పెరిగి  అభద్రతాభవానికి గురి అవుతారు. దాంతో  వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది.

యాంగ్జాయిటీ, ఒత్తిడి:-

మనుషులు అనేక ఒత్తిడుల కారణంగా యాంగ్జయిటీకి లోనవుతుంటారు. అది వారి  మనసు మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది.దీనితో వారిలో ఆత్మవిశ్వాసాన్ని దూరం అవుతుంది. ఈ ఒత్తిడుల కారణంగానే చాలామంది వారు తాము చేయాలనుకున్నది చేయలేక వెనకబడి పోతుంటారు.

చెడు స్నేహాలు

మనతో కలిసి ఉండే స్నేహాలు కూడా సరిగ్గా లేనపుడు మనం నెగెటివ్ గా మారిపోతుంటాము. అందుకే మనం  మంచి స్నేహితుల సమక్షంలోనే ఉండడం మనకి చాలా మంచిది.

మనల్ని మనం తిట్టుకోవడం
నేనిలా చేస్తున్నానేంటి? ఇలా ఎందుకు ఉంటున్నాను? నా వల్ల ఏమీ కావటం లేదు. నిజంగా నేను ఏమీ చేతకాని వాడినీ  వంటి మాటలు మనకి మనమే మాట్లాడుకోవడం వల్ల మనల్ని మనమే చేతకానివారిలా ఒప్పేసుకునట్లు  అయిపోతుంది.

పోలిక
అలాగే ఇతరులతో మనల్ని పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువగా చేసి చూసుకోకూడదు.ఎందుకు అంటే ఎవరికి వాళ్ళే ఎక్కువ కాబట్టి. మనకేం తక్కువ కాదు అన్న విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: