అప్పుడు మనకి చాలా ఆనందం వేస్తుంది. కాకపోతే ఆ ఆనందం మనలో ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అలాగే తరువాతి రోజు ఒక లక్ష రూపాయలు పోయిందనుకొండి. అప్పుడు మన పరిస్థితి. అందువల్లే మన పెద్దలు అనుభవం మీదే చెప్తారు ఏదైనా కూడా డబ్బు వల్ల శాశ్వతంగా ఆనందం రాదు. ఒకవేళ వచ్చినా ఆ ఆనందం శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం.
జ్ఞాపకాలను కొనండి : జీవితంలో మనం ఎప్పుడూ చేయని పనులు చేయాలి. ఇతర దేశాల సాంప్రదాయ పండగల్లో, స్కై డైవింగ్ చేయడమో చేయాలి. ఇలా చేయటం వలన మనకి ఒక కొత్త అనుభూతిని రావటమే కాదు మనకి జీవించాలనే కుతూహలాన్ని ఇంకొంచెం పెరుగుతుంది.
ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఖర్చుపెట్టాలి:- మనం ప్రతీ రోజూ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని పక్కనే మందు బాటిల్ పెట్టుకుని ప్రతి రోజు వేలకి వేల రూపాయలు ఖర్చు చేస్తే అందులో పెద్దగా ఆనందం ఉండదు. అదే మనం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఖర్చు పెట్టినట్లైతే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది. అదే వారానికి ఒక ఐస్ క్రీమ్ లేకపోతే నెలకి ఒకసారి కొత్త వెరైటీగా ఏదైనా ప్రయత్నించినట్లయితే అది మనకొక కొత్త అనుభూతిని ఇస్తుంది.
సాయాన్ని చేయండి : మన ఇంట్లో మనతో పాటు ఉండేవారే ఇంట్లో అన్ని పనులు చేయకుండా ఇతరులకు కూడా కొన్ని పనులు అప్పగించాలి. మనకు వీలైతే పని మనుషులను పెట్టుకోవడం మంచిది. దాని వలన మనం మన కుటుంబానికి ఇంకొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించవచ్చు . ఇలా చేయటం కేవలం మన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికే అయ్యుంటే చాలా మంచిది. అంటే తప్ప అది మనకి పనులు చేయటానికి బద్దకించి అయ్యుండకూడదు.
భవిష్యత్ ప్రణాళిక:- మనం రేపటికి ఉంటామో లేదో తెలియదు. కానీ, రేపటి కోసం మాత్రం కచ్చితంగా ఈరోజు డబ్బు దాచడం అనేది చాలా అవసరం. అందుకోసమే మనకి వచ్చే దానిలో కొంత డబ్బు తప్పని సరిగా పక్కన పెట్టాలి. అలాగే బాగా ఆలోచించి మంచి మంచి పెట్టుబడుల్లో మనం డబ్బులను పెట్టుబడిగా పెట్టాలి.
ఇలా చేయటం వలన మాత్రమే మనం డబ్బు లేనప్పుడే కాదు, డబ్బు ఎక్కువగా ఉన్నపుడు కూడా ఎల్లపుడూ ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలము.