అందుకే వ్యాపారం లోని కొన్ని నైపుణ్యాలను తెలుసుకొని బిజినెస్ చేస్తే ఫలితం అందుతుంది. ముందుగా లాయల్ కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసుకోవాలి. అనగా నిజాయితీ గల కస్టమర్లు, వీరు ఒకసారి ఒక షాపుకు అలవాటు పడ్డారు అంటే మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇతరులకు అక్కడే కొనండి అని సలహా ఇచ్చి మన బిజినెస్ కు వారు పబ్లిసిటీ పెంచుతారు. అయితే ఈ లాయల్ కస్టమర్స్ ను ఆకర్షించడానికి ఉత్తమమైన మార్గం నాణ్యమైన సరుకు, ఆమోదయోగ్యమైన ధరలు, డిస్కౌంట్లు, ఏదైనా స్పెషల్ గా ఉండేలా ఎక్సట్రా గిఫ్ట్స్ లాంటివి ఆఫర్ చేయాలి.
అలాగే కన్సేషన్ పద్దతి .. ఈ తేదీ లోపు కొనుగోలు చేసే వస్తువులకు ఇంత డిస్కౌంట్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇలాంటివి ....ఇచ్చే ప్రొడక్ట్ కి ధర తగ్గించడం పెద్దగా ఎఫెక్టివ్ అనిపించక పోవచ్చు. కానీ దానికి బదులుగా వేరొక చిన్న వస్తువు ఇచ్చినా కస్టమర్ అట్రాక్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ తో మీ బిజినెస్ ఆన్లైన్లో ఉండడం కూడా ముఖ్యమే. ఇప్పట్లో చిన్నాచితకా వ్యాపారాలు కూడా ఆన్లైన్ మార్కెటింగ్ లోకి జాయిన్ అవుతున్న విషయం తెలిసిందే.