ఈ సమాజములో ఒక మనిషిగా జీవించినంత కాలం ప్రతి ఒక్కరూ సంతోషంగా, డబ్బుతో జీవించాలని అనుకుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ అందుకు తగిన కష్టం మనము పడితేనే వాటిని చేరుకోగలము.  చాలా మంది ఒక లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని దాన్ని సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. మరి కొందరు ఒకేసారి బహుళ లక్ష్యాలను గురిగా పెట్టుకుని వాటన్నిటినీ ఎలాగైనా సాధించాలని నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఒక లక్ష్యమే కష్టమనుకుంటే ఒకే సారి రెండు, మూడు లక్ష్యాలు సాధించడం అసాధ్యమని అసలు ఇలా ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించాలి అనుకోవడం సరి కాదని కొందరు అంటుంటారు. అయితే నిపుణులు, అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఏమిటి అంటే ...!! ఒకే సారి బహుళ లక్ష్యాలను కలిగి ఉండటం వాటిని ఛేదించాలి అనుకోవడం తప్పుకాదు అలాగే అత్యాశ కాదు .

అయితే సాధించాలనే ఆశ మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మవిశ్వాసం, దైర్యం, పట్టుదల చాలా అవసరం. అలాగే తెలుసుకున్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో మీ వివిధ లక్ష్యాలను ఒకేలా చూస్తూ పోల్చుకోకండి. దేనికదే ప్రత్యేకంగా చూస్తూ మీ ఆలోచనలను ఏకం కానివ్వకండి. అంటే ఒక లక్ష్యానికి అడ్డంకులు ఎదురైనపుడు మరొక లక్ష్యంపై దాని ప్రభావం పడకుండా నిరాశ చెందకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్లాలి.

ఉదాహరణకు... డిగ్రీ తరువాత ఉన్నత విద్యను అభ్యసిస్తూనే, పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్న సమయంలో మన ఉన్నత విద్యలో ఎదురయ్యే ఆటంకాలు వలన మనం ప్రయత్నిస్తున్న పోటీ పరీక్షలపై అవి ప్రతికూల ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే మీ బహుళ లక్ష్యాలను సాధించడానికి చాలా వరకు అవకాశం ఉందని వారు అంటున్నారు.    






మరింత సమాచారం తెలుసుకోండి: