![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/winners/130/vijayam-meedhea853dc91-e20a-4284-a368-298672655e52-415x250.jpg)
సరైన లక్ష్యాన్ని ఎంచుకోవడం: అసాధ్యమైన లక్ష్యాలను ఎంచుకుని బాధపడటం కన్నా వీలయినంతలో మనకు అనుగుణంగా ఉండే లక్ష్యాలను ఎంచుకుని ప్రయత్నించడం ఉత్తమం.
ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రణాళిక, ప్రయత్నం : లక్ష్యాన్ని ఎంచుకుని మమ అనుకుంటే సరిపోదు, కోరుకున్న లక్ష్యాన్ని చేరాలంటే అందుకు ఒక మంచి ప్రణాళిక అవసరం. అలాగే ఆ ప్రణాళికను అనుసరించడానికి మీ ప్రయత్నం వెంటనే మొదలు పెట్టాలి. ఎన్ని సార్లు ప్రయత్నిస్తున్నాము అని లెక్కలు వేసుకోకుండా అలుపు అన్న భావన తో ఆగిపోకుండా దృడ సంకల్పంతో, నమ్మకం తో ముందుకు సాగాలి.
అవమానాలను , అపజయాలను అధిగమించండి : మీ ప్రయత్నం లో ఉన్న లోటుపాట్లు వలనో లేక మరేవైనా కారణాల వల్లనో ఒకటి రెండు సార్లు పరాజయం పాలయినా లేక మీ పరాజయాన్ని చూసి ఇతరులు హేళన చేసినా అవమానించినా వాటిని అడుగమించి మళ్ళీ మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి తప్ప నిరాశ పడకూడదు. రేపు మీ విజయాన్ని చూసి మిమ్మల్ని అవమానించిన వారే ప్రశంసించేలా మీరు విజయాన్ని అందుకోవాలి అన్న విషయాన్ని తప్పక గుర్తు చేసుకుంటూ ఉండండి. కాబట్టి మీరు కూడా పైన చెప్పిన విధముగా ఈ మూడు విషయాలను గుర్తుంచుకుని పాటిస్తే మీరు సక్సెస్ అవుతారు.