మటన్ : పావుకేజీ
జీడిపప్పు : వంద గ్రాములు
గసాలు : వంద గ్రాములు
కర్బూజా గింజలు : పావు కప్పు
కొబ్బరి : పావుకప్పు
టమాటాలు : రెండు
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : పావు టీ స్పూన్
నూనె : అర కప్పు
ఉల్లి పాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్
వెల్లుల్లి ముక్కలు : టేబుల్ స్పూన్
కొత్తిమీర : చిన్న కట్ట
వెన్న : అర కప్పు
గరం మషాలా : అర టీ స్పూన్
తయారుచేయు విధానం :
జీడిపప్పులు, కర్బూజా గింజలు, గసాలు, కొబ్బరి అన్నివిడివిడిగా నూనె లేకుండా వేయించి అన్ని కలిపి మిక్సిలో వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి పేస్టులా చేయాలి.
స్టవ్ ఫై కళాయిపెట్టి రెండు స్పూన్ల నూనెవేసి వేడి అయ్యాక, జీడిపప్పు పేస్టు వేసి కాసేపు వేగనిచ్చి కొద్దిగా కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఐదు నిముషాలు వుడకనిచ్చి గ్రేవీ తయారు చేసుకోవాలి.
టమాటాలు ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నూనెలో ఉడకనివ్వాలి. వీటిని చల్లార్చి వీటికి కొద్దిగా జీడిపప్పులు కలిపి మిక్సి వేస్తె టమాట ప్యూరి రెడీ అవ్వుతుంది.
మటన్ కి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి నీళ్ళు యిగిరిపోయే వరకు ఉడికించికోవాలి.
స్టవ్ మీద కళాయిపెట్టి వెన్న వేడిచేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక, పచ్చిమిర్చిముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేపాలి. వేగాక ఉడికించిన మటన్ వేసి మూడు నిముషాలు కలిపి ఉప్పు, కారం వేసి తయారుచేసిన జీడిపప్పు గ్రేవీ {సుమారు వంద గ్రాములు} వేసి రెండు నిముషాలు కలిపి మూడు టేబుల్ స్పూన్లు టమాట ప్యూరి వేసి కలుపుతూ వుడకనివ్వాలి. గ్రేవీ యిగిరి కూర తయారు అయ్యిన తరువాత గరంమషాలా, కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి. * అంతే మటన్ జీడిపప్పు కూర రెడీ.
మరింత సమాచారం తెలుసుకోండి: