కావల్సిన పదార్థాలు:
దోసె పిండి: 2 కప్పులు
టమోటోస్: 2
పచ్చిమిర్చి: 3/4
జీలకర్ర: 1 టీ స్పూన్
అల్లం పేస్ట్: 1టీ స్పూన్
ఉప్పు: సరిపడా
నూనె: ½ కప్
బట్టర్: 2 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా అల్లం, టమోటో, పచ్చిమిర్చి మరియు జీలకర, కొద్దిగా ఉప్పు, మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దోసె పిండిలో టమోటో పేస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దోసె పాన్ స్టౌ మీద పెట్టి వేడి చేసి, నూనె రాసి, దోసె పిండిని దోసెలా పాన్ మీద వేసుకోవాలి.
తర్వాత దాని మీద కొద్దిగా నూనె చిలకరించాలి. దోసె ఒక సైడ్ కాలిన తర్వాత మరో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. అంతే టమోటో దోస రెడీ. దీన్ని చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: