కావాలిన పధార్థాలు : లేడీస్ ఫింగర్ (బెండకాయ): 15 – 20  ఉల్లిపాయలు : 2  చింతపండు : కొంచెం (గోళి అంత)  కారం : 1 టీ స్పూన్ పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రిబ్బలు ఉప్పు : రుచికి తగినంత మసాలా : రుచికి తగినంత ఆవాలు : టీ స్పూన్ 1  జీలకర్ర : 1 టీ స్పూన్  ఉద్దిపప్పు 1 టీ స్పూన్ మెంతులు : చిటికెడు ధనియాల : 1 టీ స్పూన్ నూనె: సరిపడా పోపు కోసం :  ఆవాలు : ¼ టీ స్పూన్  జీలకర్ర : ½ టీ స్పూన్  కరివేపాకు : రెండు రెమ్మలు  నూనె : సరిపడా


తయారుచేయు విధానం : ముందుగా లేత బెండకాయలు నీటిలో వేసి వెంటనే కడిగి ఆరబెట్టుకోవాలి. లేదా పొడి వస్త్రంతో తుడిచి తడి ఆరనివ్వాలి. తర్వాత రెండు పక్కలా చివరలను కట్ చేసుకొని కావాలిసిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా పొట్టుతీసి కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి చింతపడును అందులో నానబెట్టుకోవాలి.


ఇప్పుడ స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో మసాలా దినుసులను ఒక దానికి తర్వాత ఒకటి వేసి వేయించుకోని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ లో విస మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు చేర్చి మెత్తని పేస్ట్ ను తయారు చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసి తక్కువ మంటలో ఐదు నుండి పది నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అందులె మసాలా ముద్దను, కరివేపాకును వేసి వేయించాలి.


ఐదు నిమిషాల తర్వాత చింతపండు గుజ్జును కూడా అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించుకోవాలి. బెండకాయ కొద్దిగా ఉడకగానే అందులో కారం, పసుపు, ఉప్పు, మరో ఐదు నిమిషాలు బెండకాయ మెత్తగా ఉడికనించి స్టౌ మీద నుండి దించేసుకోవాలి. అంతే లేడీస్ ఫింగర్ ఆనియన్ మసాలా రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో వడ్డించుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: