క్రిస్మస్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంబరాలతో చేస్తుంటారు.  చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కొత్త బట్టలు వేసుకొని..ఇళ్లంతా క్రిస్మస్ ట్రీస్ తో అలంకరించి..కొత్త కొత్త వంటకాలతో తమ స్థాయికి తగ్గట్టుగా వంటలు చేసుకొని తింటారు.  క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎక్కువగా కేకులు చేస్తుంటారు.  క్రిస్ మస్ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా చాకొలేట్ కేక్ ని ఎలా తయారు చేస్తారో చూద్దామా...

కావలసిన పదార్థాలు:

మైదాపిండి:100grm

వెన్న:100grm

పంచదార పొడి:100grm

కోడిగుడ్లు: రెండు లేదా మూడు

బేకింగ్ పౌడర్: 1tsp

పాలపొడి: 2tbsp

వెనీలా ఎసెన్స్: 1tsp

కోకో పౌడర్:2tbsp 

ఐసింగ్ కోసం: కోకో పౌడర్:50grm

వెన్న: grm

ఐసింగ్ షుగర్:100grm

వెనీలా ఎసెన్స్: 1/2tsp

వేడినీరు: తగినంత 

తయారు చేయు విధానం:

1. మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాలపొడి, కోకో పౌడర్, వెన్న, పంచదార మిక్సీలో వేసి బాగా గిలకొట్టాలి.

2. తర్వాత దీనికి కోడిగుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. 

3. ఒకవేళ పిండి మిశ్రమం పలచగా ఉంటే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ గిలకొడుతూ ఉండాలి. 

4. తరువాత ఎలక్ట్రిక్ ఓవెన్‌ లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి కేక్ చల్లారాక పైన ఐసింగ్ చేయాలి.

ఐసింగ్ కోసం: 

1. కోకో పౌడర్, ఐసింగ్ షుగర్, వెన్న, వెనీలా ఎసెన్స్ అన్నీ మిక్సీలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి. కొద్దికొద్దిగా వేడినీరు చేర్చుతూ ఈ మిశ్రమం కాస్త గట్టిపడేలా చూడాలి. 

2. ఈ చాకొలేట్ సాస్‌ ను కేక్‌ పైన పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్దాలి. ఆపైన చాకొలెట్ కేక్‌ ను అరగంట ఫ్రిజ్‌ లో ఉంచి తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే చాకొలెట్ కేక్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: