కావాల్సిన పదార్ధాలు:
ఎగ్ ప్ల్యాంట్ (వంకాయలు) - 3
క్యారేట్ - 2
ఉల్లికాడలు - 5
బంగాళదుంప - 2
పార్స్లీ- కొద్దిగాకీరా- 1
కాన్ ఫ్లోర్- 3 స్పూన్లు
ఉప్పు - తగినంత
కారం - తగినంత
ఉల్లిపాయ - 2
టమాటా - 1
గుడ్లు - 4
నూనె - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా మనం ఎగ్ ప్ల్యాంట్ ను గుండ్రంగా రింగ్స్ లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన ముక్కలను ఉప్పు వేసిన నీటిలో వేసుకోవాలి.తరువాత క్యారేట్, ఉల్లిపాయ, బంగాళదుంప, కీరా, టమాటా, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక గిన్నెలో మనం తరిగిన ముక్కలను వేసుకోని దాంట్లో కొద్దిగా పార్స్లీ, కాన్ ఫ్లోర్, తగినంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని ఉంచాలి. మనం గుండ్రంగా కట్ చేసుకున్న ఎగ్ ప్ల్యాంట్ లోని మధ్యభాగాన్ని కూడా కట్ చేసి రింగ్స్ లా చేసుకోవాలి. ఆ కట్ చేసిన వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోని వాటిని అన్ని ముక్కలు కలిపిన గిన్నెలో వేసుకొవాలి.తరువాత అలాగే గుడ్లును కూడా వేసుకోని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిమీద ఒక పెనాన్ని పెట్టి, పెనం వేడెక్కాక నూనె వేసుకుని, దాని మీద కట్ చేసిన గుండ్రటి ఎగ్ ప్ల్యాంట్ ముక్కలను పెట్టి రింగ్స్ మధ్యలో ఉన్న ప్లేస్ లో మనం ఇందాక కలుపుకుని పక్కన పెట్టిన ముక్కల మిశ్రమాన్ని వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మంట తగ్గించి ఎగ్ ప్ల్యాంట్ ముక్కలు బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన, ఈజీ హెల్దీ న్యూట్రీషియస్ "ఎగ్ ప్ల్యాంట్ లో ఆమ్లేట్" తయారైంది.న్యూట్రీషియస్ వ్యాల్యూస్:టమాటా: టమాటా లో ఉండే లైకోపీన్ అనే పదార్ధము శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంట్లో "విటమిన్-సి" పుష్కలంగా లభిస్తుంది. దీనిని ఆహారంలో చేర్చుకోటం వల్ల వ్యాధినిరోధిక శక్తి పెరుగుతుంది.
దీంట్లో విటమిన్-సి కాక మెగ్నీషియం,ఫాస్ఫరస్, కాపర్ కూడా ఉన్నాయి.బంగాళదుంప: బంగాళదుంపలో కార్బోహైడ్రేడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి ఎక్కువ క్యాలరీలను ఒక్క సారిగా అందిస్తాయి. కాబట్టి మోతాదు మించ కుండా తీసుకోటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.బంగాళదుంప తోలులో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త పోటును తగిస్తుంది. దీంట్లో విటమిన్-సి, బి-కాంమ్ప్లెక్స్ తో పాటు పొటాషియం,మెగ్నీషియం,ఫాస్ఫరస్,జింక్ ఉంటాయి. ఇవన్నీ చర్మ కాంతిని మెరుగు పరుస్తాయి. ఇది బి6 నరాల వ్యవస్తకు మేలుచేస్తుంది.క్యారెట్: ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలకు శారీరకంగా,మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
క్యారేట్ ని సలాడ్ల రూపంలోనూ,జ్యూసెస్ రూపంలోనూ తీసుకున్నట్లయితే మంచి పోషక విలువలు,ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు.విటమిన్లు,ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతూల్యం గల కూరగాయ క్యారెట్ విటమిన్ బి,సి,జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మ్యాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లారిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది.కీరా: కీరాలో విటమిన్ ఎ,బి మరియు సి లతో పాటు పొటాషియం,మెగ్నిషియం,సిలికాన్ ఇంకా అనేక పోషక పదార్ధాలు ఉన్నాయి.కీరా తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రక్తపోటును సమర్ధవంతంగా ఎదుర్కుంటుంది. ఇది డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది.ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
అలసిన కళ్లకు ఉపశమనం ఇస్తుంది. మధుమేహం, కొలెస్ట్రాలను తగ్గిస్తూ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. చేతి గోర్లను కాంతివంతగా చేయటమే కాక కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.పచ్చి కీరాను తినడం ద్వారా నోటి నుండి దుర్వాసన కూడా రాదు.ఉల్లిపాయ: ఉల్లిపాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్ కి వస్తుంది. వీటిని గుజ్జుగా దంచి వెనీగర్ తో కలిపి తింటే జీర్నాసయ సమస్యలు తగ్గిపొతాయి. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల బీపీ,గుండె పోట్టూ,ఆస్తమా, ఎల్ర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేని, స్తూలకాయం వంటి సమస్యలు రావు. కాలిన గాయాల పైన పచ్చి ఉల్లిపాయతో మర్ధన చెస్తే ఆ ప్రదేశంలో కలిగే మంటా, నొప్పి తగ్గిపోయి,ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా చేస్తుంది.