కావాలసిన వస్తువులు :
మటన్ : 500 గ్రా, లు
పెరుగు : ఒక స్పూను
బంగాళదుంపలు: ఆరు
మిరియాలు : అర స్పూను
నిమ్మరసం :2 స్పూన్లు
కేరట్ : 100 గ్రా, లు
బీన్స్ : 100 గ్రా.లు
నూనె : 125 గ్రా.లు
పసుపు : ఒక స్పూను
కారం : రెండు స్పూనులు
లవంగాలు : ఆరు
యాలకులు : ఆరు
దాసినచెక్క : రెండు బద్దలు
పలావు ఆకులు : రెండు
అల్లం గుజ్జు : ఒక స్పూను
వెల్లుల్లి గుజ్జు : ఒకస్పూను
ఉల్లిగుజ్జు : 100 గ్రా.లు
ఉప్పు : సరిపడా
ధనియాలపొడి : నాలుగు స్పూన్లు
కొత్తిమీర : ఒక కట్ట
తయారీ చేయువిధానం:
ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగిన తరువాత లవంగాలు, దాసిన చెక్కపలావు. ఆకులు వేసి వేయించాలి. అందులో మటన్ ముక్కలను వేసి గరిటెతో కలుపుతూ అయిదు నిమిషాలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాల పొడి, సరిపడా ఉప్పు బాగా కలిపి సన్నమంట మీద ఉడికించండి.
ఇప్పడు పెరుగు, ఉల్లిముద్ద, మిరియాలుపొడి వేసి బాగా కలపండి ముందుగా ఉడికించిన కాయకూరలను కూడా వేసి మూతపెట్టి అయిదు నిమిషాలపాటు ఉడికించి దింపి నిమ్మరసం పిండి దింపండి.
మరింత సమాచారం తెలుసుకోండి: