మహిళలకు ముఖ్యంగా అందాల పోటీలు అంటే చాల ఇష్టం ఉంటుంది. ఇక అందాల పోటీలంటే బికినీ ప్రదర్శనలు, నడుము కొలతలే కాదు... సామాజిక ప్రయోజనాలూ కూడా లభిస్తూఉంటాయి. అలాంటివే అర్ణిత దంపల వెళ్లిన అందాల పోటీలు. పోలో కష్టమైనా... నా ఆసక్తిని చూసి అమ్మానాన్నలు ఆమెను బాగా ప్రోత్సహించారు. దాంతో పాటు అందాల పోటీలు అంటే ఆమెకు చాల ఇష్టం.
కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి మిస్ ఇంటర్నేషనల్
సౌత్ జోన్ పోటీల్లో పోటీ చేసి విజయం కైవసం చేసుకుంది. దింతో ఆమెకు పలు అంతర్జాతీయ అందాల పోటీలకు వెళ్లే అవకాశాలు చాల రావడం జరిగాయి. వాటిలో మిస్ టూరిజం ఒకటైతే, తాజాగా జరిగిన పోలో ఇంటర్నేషనల్
బ్యూటీ పీజెంట్ ఇంకొకటి. అర్ణిత దంపల మాత్రం గుర్రంపై అందాల పోటీలకు వెళ్ళింది.
పోలో ఇంటర్నేషనల్
బ్యూటీ పీజెంట్ లో ఆట భాగం కావడం, సేవ చేసే అవకాశం ఉండటంతో ఈ పోటీలకు వెళ్లడం జరిగింది అని అంటుంది. ఇది ఇటీవల దుబాయ్ లో జరిగింది. ఈ పోలో క్రీడలో మరిన్ని నైపుణ్యాలు పెంచుకోవడం జరిగింది అర్ణిత. పోలో ఇంటర్నేషనల్
బ్యూటీ పీజెంట్ పోటీలకు 97 దేశాల నుంచి ప్రాతినిధ్యం వచ్చారు. సేవా చేయాలి కాబట్టి... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినులకు డిజిటల్ విద్యపై అవగాహన కల్పించేందుకు అందరు సిద్ధం అవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ పోటీల వెనుకున్న ప్రధాన లక్ష్యమే సేవ, పోలో క్రీడపై ప్రచారం చేయడమే. ఇవన్నీ ఎటువంటి పొరపాట్లు లేకుండా విజయవంతం చేసినందుకే ఐక్యరాజ్య సమితి ప్రశంసాపత్రం అందించింది అర్ణిత దంపలకు.
ఇక అర్ణిత మాత్రం సేవను ఇప్పటికి కొనసాగిస్తోంది... పోటీలు అయిపోయినా నా కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగించడం విశేషం. వీటి అన్నిటికి ముఖ్య కారణం నా కుటుంబనేపథ్యమే అని తెలుపుతుంది. ప్రస్తుతం అర్ణిత మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు డిజిటల్ పాఠాలు ఎంత వరకు అవసరం, వారు దాన్ని అందిపుచ్చుకోవడానికి ఎదురవుతోన్న సమస్యలు, సవాళ్లు వంటివి అధ్యయనం చేస్తూనే, సులువుగా ఎలా ఉపయోగించుకోవచ్చో పిల్లలకు సులువైన మార్గంలో నేర్పుతుంది. నాన్న
సతీష్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ గా చేస్తున్నారు. అర్ణిత అమ్మ కుముదా దేవి గృహిణి. ఈమె హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసింది. ఈమె ఎంబీఏ దూరవిద్యలో చదువుతుంది. ఈమె భవిష్యత్తులో వ్యాపారవేత్త కావాలన్నది ఆమే కల.