కంది కారం.. వంట ఏదైనా సరే.. కంది కారం ఉండాల్సిందే. పచ్చి పులుసు చేసిన కోడికూర పులుసు చేసిన కంది కారం ఉండాల్సిందే. ఇది నెల్లూరు స్టైల్. నెల్లూరు వారికీ ఇది బాగా అర్థం అవుతుంది. నెల్లూరు ఆహార ప్రియులకు కేవలం అన్నం,
నెయ్యి, కంది కారం పెడితే చాలు కడుపు నిండా తిని సంతోషంగా ఉంటారు. అంత కమ్మగా ఉండే ఈ కంది కారం నెల్లూరు వాసులకె సొంతం కాదు కదా.. మనం కూడా ఎలా చెయ్యాలో నేర్చుకొని చేసుకొని తిందాం. ఎంతో రుచికరమైన ఈ కంది కారం ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావలసిన పదార్ధాలు..
కందిపప్పు: 100గ్రాములు
ఎండు మిరపకాయలు: 50గ్రాములు
శనగపప్పు: ఒక స్పూను
పెసరపప్పు: ఒక స్పూను
ఇంగువపొడి: ఒక స్పూను
జీలకర్ర: రెండు స్పూన్లు
ఉప్పు: తగినంత
నూనె: తగినంత.
తయారి విధానం : కందిపప్పు ముందుగా వేయించుకొని పాన్ లో నూనెను వేసి
జీలకర్ర,
ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు చివరికి
వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని
మిక్సీ జార్‌లో వేసి.. సరిపడా ఉప్పు, కొంచెం
ఇంగువ వేసి మరీ మెత్తగా కాకుండా
మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో కాకుండా రుబ్బుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ కంది కారంను అన్నంలోకి,
ఇడ్లీ లోకి మీకు ఇష్టమైన వాటిలో కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. అంత రుచిగా ఈ వంటకం ఉంటుంది. ఇంకా ఇంట్లో ఏవైనా ఫ్రై చేసినప్పుడు వాటిపై చివరగా రెండు స్పూన్ల కంది కారం చల్లితే రుచి అద్భుతంగా ఉంటుంది.