నా పేరు ప్రియాంక అండి.. మొన్న అత్యాచారం చేసి కామాంధుల చేతిలో చంపబడిన ప్రియాంకనండి... కొంచెం మీ పనులు పక్కన పెట్టి ఈ అభాగ్యురాలి భాధ వినండి.
మా అమ్మ - నాన్న కి నేను, నా చెల్లి ఇద్దరం ఆడపిల్లలం అండి. ఎంతో గారాబంగా పెంచారు.. మేమంటే చాలా ఇష్టం వాళ్ళకి.. ఆడపిల్లలం కదా అండి సమాజం లో ఎలా ఉండాలో ఉండకూడదో అన్ని నేర్పించారు... వాళ్ళకి నన్ను డాక్టర్ చేయాలనీ కోరిక. డాక్టర్ అంటే మాటల అండి చాలా డబ్బులు కావాలి. అందుకే పశువుల డాక్టర్ ని చేసారండి... మొదటిలో కొంచెం బాధ పడ్డాను అండి పశువుల డాక్టర్ అని. కానీ ఇపుడు చాలా గర్వపడుతున్నాను..
పశువులకి మాటలు రాకపోయినా మన బాషాని సైగలని అర్ధం చేసుకుంటాయి.
నేను పని చేసే చోట పశువుల్ని గట్టిగ అరిస్తే చాలు మన మాట వింటాయి. ట్రీట్మెంట్ సమయములో అనుకోకుండా నా కాలు తొక్కితే హేయ్ అని గట్టిగ అరిస్తే చాలు కాలు తీసి పక్కన పెట్టేవి అండి... మాటలు మాట్లాడలేని ముగ జీవాలే నా నొప్పిని, నా బాధని అర్ధం చేసుకున్నాయి. కానీ అన్ని తెలిసి మాటలు వచ్చి, జనంలో తిరుగుతూ మంచి, చెడు అన్ని తెలిసిన మనుషులకి ఎందుకు ఒక "ఆడ"పిల్ల బాధ అర్ధం కావటం లేదు అండి.
నన్ను (ప్రియాంక ) హింసించి, కొట్టి, క్రూరాతికురమగా అనుభవించి, కాల్చి మరి చంపారు ఈ మనుషులు. కాపాడండి, నన్ను వదిలేయండి ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న నా కోసం ఎదురుచూస్తారు అన్నా నన్ను వదలలేదు.." అన్నా" నన్ను వదిలిపెట్టు ని "చెల్లి" లాంటి దాన్ని అన్నా విడిచిపెట్టలేదు.. ఎంతో నరకం అనుభవించాను.. పశువులు నయం అనిపించింది.. నా తల్లి -తండ్రులు చివరి చూపు కూడా చూసుకోడానికి వీలు లేకుండా కాల్చి బూడిద చేసారండి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించారు ఎంత ఏడిచానో నాకు (priyanka) వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు...
నా గూర్చి చదివే మీకే కనీళ్లు వస్తున్నాయి కదా ! మరి అనుభవించిన నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అండి.. ప్రతి తల్లి - తండ్రుల కి నాదొక విన్నపం అండి.. మీ పిల్లలు జాగ్రత్త. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు.. అబ్బాయిలు ఉన్న తల్లులు మీకే చెబుతున్న మీ పిల్లల్ని సరయిన నడవడిక తో పెంచండి.. ఆస్తులు ఇవ్వకపోయినా, ఆడపిల్లలని గౌరవించమని చెప్పండి.
నాకు ఎందుకో చెప్పాలని అనిపించి చెబుతున్న అండి. చివరగా ఒక మాట తప్పు చేయని నేను పైన ఉన్న, తప్పు చేసిన వాళ్ళు కింద ఉన్నారు.. నా ఆత్మ గోషా అర్ధం చేసుకోండి...
"" కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కామాంధుల చేతిలో బలిఅయ్యవా "" అని ఒక కవి రాసాడు.. ఇక నుంచి అయినా "పువ్వుల్ని వికసింప చేద్దాం, వాడి పోనివ్వకుండా చేద్దాం "
ఇట్లు,
మీ ప్రియాంక(ఆత్మ)