మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన అనంతపురంలో జరిగింది. అనంతపురంలోని హార్టికల్చర్ కాలేజీ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిని పాపంపేటకు చెందిన పోలేరమ్మ, ఆర్తి, దీపగా గుర్తించారు పోలీసులు. ఆర్థిక సమస్యల కారణంగా భర్తతో గొడవ పడి ఈ ఘాతుకానికి ఆ మహిళ ఒడిగట్టిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... పాపంపేట ప్రాంతానికి చెందిన వెంకటేశ్, పోలేరమ్మ (45) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఆర్తి (17), దీప్తి (11) ఉన్నారు. పెద్ద కుమార్తె ఆర్తి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, ప్రస్తుతం నర్సింగ్‌ లో శిక్షణ పొందుతోంది. రెండవ కూతురు దీప 7 తరగతి చదువుతుంది. పిల్లల తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. తరచూ భార్య, భర్తలకు గొడవలు అవుతుండేవి.   

 

అయితే, వారికున్న ఆర్థిక సమస్యల కారణంగా పోలేరమ్మ ఇటీవల తన ఆభరణాలను తాకట్టు పెట్టింది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో మరోసారి పోలేరమ్మ, వెంకటేశ్ గొడవపడ్డారు. దీంతో పోలేరమ్మ తన కుమార్తెలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలింపు చేపట్టినా.. ఆచూకీ లభ్యం కాలేదు.

 

ఆదివారం తెల్లవారు జామున అటువైపు మార్నింగ్ వాక్ వచ్చిన వారు రైలు పట్టాలపై మృత దేహాలను గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని మృతదేహాలు పోలేరమ్మ, ఆర్తి, దీప్తిగా విచారణలో తేలింది. దీని గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: