ముంబైలోని పోష్ ఏరియాలో ఉండే ఓ టాప్ ఐబీ స్కూల్‌కి చెందిన 8 మంది విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. 13,14ఏళ్ల వయసున్న ఈ ఎనిమిది మంది వాట్సాప్‌లోని క్లాస్‌మేట్స్ గ్రూప్‌లో చేసిన చాట్ బయటకు లీకైంది.చాట్‌లో తమ క్లాస్ గర్ల్స్‌ని ఉద్దేశించి రేప్,గ్యాంగ్ బ్యాంగ్ వంటి పదాలను ఎక్కువగా ఉపయోగించారు. ఈ చాట్ ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రుల దృష్టిలో పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ప్రముఖుల కుటుంబాలకు చెందిన ఆ ఇద్దరు బాలికల తల్లులు దీనిపై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

 

నవంబర్ 23న వాట్సాప్‌లో ఈ ఎనిమిది మందితో పాటు మరికొందరు స్టూడెంట్స్ చేసిన చాట్‌ను ఆ తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.తమ క్లాస్‌మేట్స్ అయిన పలువురు విద్యార్థినులను ఉద్దేశించి ఆ బాయ్స్ 'వన్ నైట్ స్టాండ్' గురించి మాట్లాడారు. పలానా విద్యార్థిని రేప్ చేయాలని అందులో చర్చించారు.ఆ తర్వాత ప్రత్యేకించి ఇద్దరు విద్యార్థినులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో వారు చాటింగ్ చేశారు. గర్ల్స్ అందరిని చెత్త అని పేర్కొన్న ఆ బాయ్స్.. హోమో సెక్స్, గే,లెస్బియన్,రేప్ వంటి పదాలను చాట్‌లో చాలాసార్లు ఉపయోగించారు.

 

సదరు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 8 మంది విద్యార్థులను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. నిజానికి ఇదంతా స్కూల్ పరిధిలోనే జరిగినప్పటికీ.. ఓ పత్రిక కథనంతో విషయం బయటకు పొక్కింది. విద్యార్థినుల తల్లిదండ్రులు తమకు స్కూల్ యాజమాన్యంపై నమ్మకం ఉందని.. ఈ విషయంపై ఎక్కడా ఫిర్యాదు చేయదలుచుకోలేదని,వారే పరిష్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

ముంబైలోని ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అసభ్యకరంగా చాటింగ్ చేశారు. 13, 14 సంవత్సరాలు కూడా లేని విద్యార్థులు, తమ క్లాస్‌మేట్స్ అయిన అమ్మాయిల గురించి అత్యంత దారుణంగా ఆలోచిస్తూ, వారిని ఎలా రేప్ చేయాలి, గ్యాంగ్ రేప్ చేయాలి? అనే విధంగా వాట్సాప్‌లో చాటింగ్ చేసిన విషయాలు చర్చించారు.  వారిలో ఓ విద్యార్థికి చెందిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి విషయం మొత్తం బహిర్గతం చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం ఆ ఎనిమిదిమందిని సస్పెండ్ చేసింది. ముంబైలోని ఓ బిజినెస్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ క్లాస్ మేట్స్ గురించి వాట్సాప్‌లో ఇలాంటి రాతలు రాసినట్టు ఓ ప్రముఖ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ‘దాన్ని బీభత్సంగా .... ’ ‘ఆమె అస్తిత్వాన్నే నాశనం చేయాలి.’ ‘వాడిని వాళ్ల నాన్న రేప్ చేశాడు.’ లాంటి విషయాలు కూడా ఆ చాటింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. ఈ చాటింగ్ విషయం వెలుగులోకి రావడంతో అమ్మాయిలు స్కూల్‌కి వెళ్లడానికి కూడా భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: