హైదరాబాద్‌లో నగరానికి ఏమైంది.. ముంబైని మించిన రేంజులో వ్యభిచారం జరుగుతుంది..రోజుకో విదంగా కేసులు వచ్చిపడుతున్నాయి.. అయినా కూడా ఈ వ్యవహారం ఎక్కడ తగ్గలేదు..ఏదోక విధంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న సెక్స్ రాకెట్ దందాను పోలీసులు ఛేదించారు.
మామూలుగా బయట ఈ వ్యవహారం సాగిస్తే.. ఎవరికి అనుమానం రాకుండా ఆన్‌లై న ద్వారా వ్యభిచారంనిర్వహిస్తున్న పలువురు యువకులు, యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన చిట్టి, చరణ్ అనే యువకులు ‘లోకంటో’ అనే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు.
ఈ సైట్ ద్వారా విటులకు గాలం వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మొత్తం ఆర్థిక లావాదేవీలు నిర్వహించి బీకే గూడలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం వ్యభిచార గృహంపై దాడి చేశారు.ప్రధాన నిందితుడు చరణ్ తప్పించుకోగా మరో నిర్వాహకుడు చిట్టి పోలీసుల చేతికి చిక్కాడు.
అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడితో పాటు విటులు ఎస్.సాయికుమార్, జె.కార్తీక్, ఎం.విఘ్నేష్‌ల సహా ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ కోసం గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ సెక్స్ రాకెట్ల గుట్టు ఇలా వరుసగా హైదరాబాద్ లో జరుగుతూనే ఉన్నాయి..