ప్రేమ అనేది ఈ మధ్య కాలంలో వ్యసనంలాగా మారింది.. తిండి లేకపోయిన కూడా యువత ఉంటారేమో గానీ. ప్రేమ అనే పదం లేకుండా మాత్రం ఉండలేరు. అందుకే ఈ సమాజం కూడా అలానే మారిందని చెప్పాలి. అందుకే ప్రేమ పేరుతో చాలా మంది యువత మోసపోతున్నారు. మరికొంతమంది ఏకంగా ప్రాణాలను కోల్పోతున్నారు. ఎలా ఓ ప్రబుద్దుడు ఉద్యోగం రానంతవరకు ప్రేమ పేరుతో తెగ తిరిగాడు. తీరా ఉద్యోగం వచ్చాక నువ్వు వద్దు పో అన్నాడని ఓ యువతీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

 

ప్రేమ పేరుతో ఓ ఆర్మీ ఉద్యోగి తనను నమ్మించి లొంగదీసుకుని మోసం చేశాడని ఓ యువతి గుంటూరు జిల్లా నిజాంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముత్తుపల్లి గ్రామానికి చెందిన పిట్టు నాగరాజురెడ్డి కొన్నేళ్ల క్రితం ఆన్‌లైన్‌ వస్తువుల డెలివరీ వ్యాపారం చేశాడు. తన స్నేహితురాలైన యువతికి తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఓ వైపు వ్యాపారం కొనసాగిస్తూనే ఇద్దరూ సినిమాలు, షికార్లంటూ విచ్చలవిడిగా తిరిగేవారు.

 

అలా కొంతకాలం కలిసి తిరిగారు. ఆపై అతనికి ఆర్మీలో ఉద్యోగం రావడంతో అతన్ని ఆమె ఒత్తిడి చేసింది. యువతి ఒత్తిడి చేయగా ఆమెను బ్లాక్‌లో పెట్టేశాడు. ప్రియుడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో యువతి అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది.నాగరాజురెడ్డి తల్లిదండ్రులు శివారెడ్డి, ఆదిలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను బెదిరించారు.

 

తన కుమారునికి మంచి ఉద్యోగం వచ్చిందని, మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.దాంతో మోసపోయానని గ్రహించిన యువతీ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్బంగా దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసు పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: