బార్య భర్తల గొడవలు అనేవి కామన్...కానీ రోజు ఉంటే వెంటనే పరిష్కరిచాలని అంటారు. అలా లేని పక్షంలో పెద్దలలో కూర్చొని చర్చలు జరపాలని అందరూ అంటారు.. అలాంటి క్రమంలో చాలా మంది గొడవలు అని చాలా మంది అంటున్నారు.. లేదా ఒక్కోసారి ఈ గొడవలు ఎక్కువైతే ప్రాణాలను కూడా కోల్పోతారని చాలా మంది అంటున్నారు.. ఎక్కడా కూడా ఓ దారుణం జరిగింది..
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో భార్య క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోగా... ఆమె ఎడబాటు తాళలేక భర్త ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రాణాలు తీసుకున్నాడు. షోళింగర్ సమీపంలోని కొడైక్కల్ గ్రామానికి చెందిన వెంకటేశన్(30), నిర్మల(23) దంపతులకు సంజన(3), రితిక(1) అనే కుమార్తెలు ఉన్నారు. వెంకటేశన్ నర్సింగ్ కోర్సు చదివి బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. నిర్మల పిల్లలతో కలిసి అత్తింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తరుచూ అత్తమామలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటాన్ని నిర్మల సహించలేకపోయింది...
అయితే, భర్త కూడ దూరంగా ఉండటంతో ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణాలను కోల్పోయింది..భార్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న వెంకటేశన్ వెంటనే బెంగళూరు నుంచి గ్రామానికి వచ్చాడు. విగతజీవిగా పడివున్న భార్య మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అశ్రునయనాల మధ్య భార్యకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే భార్య ఆత్మహత్య కేసులో పోలీసులు తనని ప్రశ్నించి అరెస్ట్ చేస్తారేమోనని వెంకటేశన్ భయపడ్డాడు..అలా తర్వాత రోజు రైలు కింద పడి ఆత్మహత్య. చేసుకున్నాడు..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు...అమ్మ లేకుండా నాన్న లేకుండా పిల్లలు ఉండలేరు అని అతనే పిల్లల్ని కూడా చంపేశారని అనుమానం...