అందం ఆడవాళ్ళ సొంతం. ఆ  అందం కోసం ఆడవాళ్లు ఎన్ని చిట్కాలు అన్నా పాటిస్తారు.  ఇంతకుముందు అందరు ఇంటి చిట్కాలనే ఎక్కువగా పాటించేవారు. కానీ మార్కెట్లో అందుబాటులో చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉండడంతో అందరు వాటివైపే మొగ్గుచూపుతున్నారు. అవి తక్కువ టైములో ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తుంది కాబట్టి వాటి వైపు చూస్తున్నారు. కానీ వాటిలో వాడే కెమికల్స్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంటి చిట్కాలతో మీ ముఖ మెరవాలంటే   ఈ చిట్కాలను పాటించండి. మీ ముఖం కాంతితో మెరవాలంటే తులసి ఆకుల గుజ్జును నిద్రకు ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే చన్నీటితో కడిగితే ముఖం కాంతివంతం అవుతుంది.

 

మొటిమల బాధితులు తాజా పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని తర్వాత చన్నీటితో కడిగితే ఎంతటి మొండి మొటిమలైనా మాయమవుతాయి.

 

వేధించే మొండి మొటిమలకు పండిన టమాటా లేదా వెల్లుల్లి లేదా పుదీనా రసం రాసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు మాయం కావాల్సిందే.

 

ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలతో ఇబ్బంది పడేవారు బొప్పాయిపండు గుజ్జుని కళ్ళకి తగలకుండా ముడతలు, మచ్చల మీద రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు ,నల్ల మచ్చలు తొలగి పోతాయి.

 

పచ్చి శనగపప్పు రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయం రుబ్బి అందులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత మంచినీటితో కడిగితే ముఖం కాంతి వంతమవుతుంది.

 

అర టీ స్పూన్‌ నిమ్మరసంలో కొద్దిగా గంధం తీసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇందులో బొప్పాయి గుజ్జుని కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి.ఇది మీ చర్మకాంతిని కూడా మెరుగు పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: