చాలామందిని వేదించే అతి పెద్ద సమస్య చుండ్రు. ఈ చుండ్రు వలన జుట్టు అందవిహీనంగా మారడమే కాకుండా మొహంపై మొటిమలు కూడా వచ్చేలా చేస్తుంది. చుండ్రు వల్ల చిరాకు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని సహజ పద్దతుల ద్వారా చుండ్రుకి చెక్ పెట్టొచ్చు. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూద్దాం.బూడిద గుమ్మడికాయ గింజలు, తొక్కలను కొబ్బరి నూనెలో మరిగించాలి. ఆ మిశ్రమాన్ని తల వెంట్రులకు బాగా పట్టించాలి.
ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాదు జుట్టు సహజంగా మెరుస్తూ ఉంటుంది. జుట్టు మెత్తగా మారి, పొడవుగా పెరుగుతాయి.250 గ్రాముల మజ్జిగ, 10 గ్రాముల బెల్లం కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కొంతసేపటి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రును నివారించవచ్చు. మందార పూలను ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి.వారానికి కనీసం రెండు సార్లు అయినా ఇలా చేస్తే చుండ్రు భాద తప్పుతుంది.
ఈ మందార నూనెను ప్రతి రోజు తలకు పట్టిస్తుంటే చుండ్రు నివారణతో పాటు జుట్టు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. అలాగే వెంట్రుకలు కూడా త్వరగా తెల్లబడవు. అలాగే గోరింటాకును బాగా ఎండబెట్టాలి. ఎండిన ఆకుల్ని మెత్తని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణంలో కొబ్బరి నూనె కలిపి తలకి రాయాలి. గంట తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కూడా చుండ్రు బారి నుండి బయటపడవచ్చు.
పెరుగులో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది చుండ్రును నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం చక్కగా తలస్నానం చేసిన తర్వాత తలకు పెరుగు పట్టించి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడుక్కొని మరోసారి మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.