అందం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. అందులోను మన చర్మం తెల్లగా మెరిసిపోతుంటే ఒక్కోసారి మనల్ని చూసుకుని మనమే మురిసిపోతుంటాము. అలాగే కొంతమంది చర్మం నల్లగా ఉంటుంది.. వాళ్ళు అనుకుంటారు నా నేను కూడా తెల్లగా ఉంటే బాగుండు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మన ఇంటి చిట్కాలు.

 

 

పెరుగు, తేనెతో మంచి ఫలితం ఉంటుంది.  పెరుగులో వుండే ఎంజైమ్స్ చర్మాన్నినిగనిగలాడేలా చేస్తాయి. అలాగే తేనే తేమని అందించటమే కాదు, యాంటి బాక్టీరియల్ ప్రోపర్టీస్ కూడా కలిగి వుంటుంది. ఈ రెండిటిని కలిపి ముఖానికి మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.తేనే, పెరుగు సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 15 నిముషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగెయ్యాలి. చర్మం నిగనిగలాడుతూ కొత్తకాంతిని స్వంతంచేసుకుంటుంది 

 

అలాగే శెనగపిండి, నిమ్మ కలిస్తే నలుపు విరిగిపోతుంది. శనగపిండి పావుకప్పు, రెండు స్పూన్ల నిమ్మరసం లేదా పాలు తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. శనగపిండి పడనివాళ్ళు పసుపు వాడొచ్చు. తయారు చేసుకున్న పేస్ట్ ను పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తరువాత పేస్ట్ ను పట్టించి పదిహేను నిముషాలు అలాగే ఉంచి తరువాత కడిగెయ్యాలి. ఈ ప్యాక్ తో ఇన్స్టంట్ గ్లో పొందవచ్చు.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నల్లబడటమనే సమస్య వుండదు.

 

శనగపిండి -పసుపు మాస్క్ కూడా ముఖానికి మంచిది.

చర్మం తెల్లబడటానికి మరియు గుర్తులను తొలగించటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ మాస్క్ తయారుచేయటం చాలా సులభం. రెండు స్పూన్స్ శనగపిండిలో చిటికెడు పసుపు,ఒక స్పూన్ నిమ్మరసం లేదా పెరుగు ను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 20 నిముషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేయాలి

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: