ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఏదీ లేదు. తన ప్రాణం పోయినా సరే తన బిడ్డ ప్రాణాలుకాపాడుకోవడానికి చూస్తుంది తల్లి ప్రేమ. మరి అటువంటి తల్లి ప్రేమను దేవుడు పుట్టబోయే బిడ్డకు ఎంతో చక్కగా వివరించే తల్లి ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటాడు.ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది.అందరూ అనుకుంటున్నారూ. రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నావంట కదా!ఇంతచిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను?అని.. దానికి భగవంతుడు చిరునవ్వుతో నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది.ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా ని కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని మరి చూస్తుంది. నీ  కోసంఆడుతుంది, పాడుతుంది.నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది.నిన్ను ఎల్ల వేళలా ఆనందంగా  ఉంచుతుంది.నన్ను గుర్తుకు రాకుండా చేస్తుంది

 

మరి నాకు అక్కడ భాష రాదు కదా.మాటలు ఎలా అర్ధం చేసుకోను?నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు? అని అడిగింది పాప.నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు.అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది.ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను కాపాడుకొంటుంది అన్నాడు భగవంతుడు.మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను?నీ దేవత రెండు చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్దించాలో చెబుతుంది.నీలో ఉండే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతుంది అన్నాడు.అప్పుడు ఆ పాప నా దేవత పేరేంటి అని అడిగింది.

 

ఆ దేవత పేరు "అమ్మ "అని సమాధానమిచ్చాడు భగవంతుడు. ఈ సృష్టిలో అన్ని జీవరాశుల కంటే తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఏదీ లేదు అనడానికి ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఎన్ని సాధించినా అది తల్లి ప్రేమ ముందు తక్కువే. తల్లికి మించిన దైవం లేదు అనే నానుడి ఎందుకు అని అంటారు. ఈ విషయాన్ని సాక్షాత్తు దైవం కూడా ఒప్పుకున్నాడు. ప్రసవవేదన సమయంలో తల్లి పడే ఆరాటం, ప్రసవించిన తర్వాత బిడ్డను చూసుకొని ఆ ఆనందంలో తాను పడిన నరకయాతన అంతా  మర్చిపోతుంది. మరి అటువంటి గొప్ప మాతృమూర్తిని  ప్రస్తుత యువత అమ్మ విలువ  తెలుసుకోకుండా తల్లిదండ్రులుని అనాధాశ్రమాలు కి అంకితం చేస్తున్నారు.కనిపించని దేవుడి కోసం దండం పెడతాం.. కని పెంచిన అమ్మకి మాత్రం మనోవేదన మిగులుస్తున్నాము... 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: