అందం అంటేనే ఆడవాళ్లు. అందంగా రెడీ అవ్వాలన్న, అందంగా కనిపించాలన్న ఆడవాళ్ళకి సాటి వేరొకరు ఉండరు.. అయితే అందులోను పార్టీ, ఫంక్షన్ అంటే చాలు మన హడావుడి గూర్చి మాటల్లో చెప్పలేము. ముందు రోజు నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలని ముందే రెడీ చేసి పెట్టుకుంటాము. అయితే మనం మామూలు రోజుల్లో ఎలాగా ఉన్న సరే ఏదైనా పార్టి లేదా ఫంక్షన్ కి వెళ్ళాలంటే మాత్రం మన ముఖంలో కొద్దిగా స్పెషల్ అట్రాక్షన్ కోరుకుంటాము పార్టి లో లేదా ఫంక్షన్ లో మనమే మంచి అందంగా ఉండాలంటే పార్టికి వెళ్ళే ముందు ఒక పావు గంట ముందు ఇలాగా చేస్తే సరిపోతుంది.
ముందుగా కొద్దిగా పచ్చి పాలు (కొద్దిగా చల్లని పాలు) దానిలో ఒక స్పూన్ సెనగపిండి కలిపి ముఖానికి రాయాలి అలాగా రాసిన ఒక్క 10 నిమిషాల తరువాత కొద్దిగా చల్లని నీరు తీసుకుని ముఖం మీద రుద్దుతూ కడిగివెయ్యాలి
తరువాత కొద్దిగా టమాటో జ్యూస్ (టమాటో కట్ చేస్తే వచ్చిన రసాన్ని) తీసుకుని గింజలు తీసేసి ముఖం మొత్తం రాసుకుని పావు గంట తరువాత కడిగివేయ్యాలి.అయితే టమాటో జ్యూస్ కూడా కొద్దిగా చల్లగా ఉండాలి
ఇలాగా చేస్తే ముఖం చాలా మెరుస్తుంది పైగా అలసట నీరసం అన్ని పోయి ముఖం చాలా అందంగా ఉంటుంది.అలాగే పార్టీ ముందు రోజే కావలిసిన నగలు, మేకప్ కిట్, డ్రెస్ అన్ని రెడీ గా పెట్టుకుంటే కొంచెం టైమ్ సేవ్ అయిది.. వెళ్లే ముందు రోజు హడావుడి పడకుండా సరిపోతుంది.. అలాగే ఫంక్షన్ ముందు రోజు కొంచెం ఎక్కువ సేపు నిద్రపోతే ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది. డ్రెస్ కి సరిపోయే నైల్ పోలిష్, ఇంకా మాచింగ్ గాడెజ్ట్స్ అన్ని రెడీ పెట్టుకోవాలి.. మెహందీ కూడా ఫంక్షన్ కి వెళ్లే రెండు గంటల ముందు పెట్టుకుంటే సరిపోతుంది