భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా..? ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తనమాటే వినాలనుకోవడం ఒకటి.
ప్రతి భార్యకు భర్త కంటే స్పెషల్ ఎవరుంటారు చెప్పండి. మీ భర్త మంచి వారు అయితే ఆయన మీకు మరింత స్పెషల్. ఈ విషయం తనకి తెలియ చేయాలంటే ఎలా? మాటలతో చెప్పొచ్చు లేదా పనులతో చూపించవచ్చు. మాటలతో చెప్పడం కన్నా పనులతో చూపిస్తే మీ వారు స్పెషల్గా ఫీల్ అ య్యి మిమ్మల్ని మరింత ఇష్టపడతాడు.మన జీవితంలో ఆచరించాల్సివన్నీ మహాభారతంలో కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్నదానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోతోంది.అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్దా సంభాషించకూడదు. భార్యాభర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దాని కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వసీకరణకు లొంగరు. కొందరు ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలుగదట. అలాగే ప్రతి భర్త భార్యలో స్నేహితురాలిని చూసుకుంటాడు.
తనకి సంబంధించిన ప్రతి విషయాన్నీ భార్య తో పంచుకోవాలనుకుంటాడు.. ప్రతి భార్య భర్త మనసు అర్ధం చేసుకుని మంచి, చెడులో తోడుగా ఉండాలి. అత్త మామలని కన్నా తల్లి తండ్రులుగా చూసుకొవాలి. అపుడే భర్త దృష్టిలో భార్య దేవతలాగా కనపడుతుంది.పక్కన ఉండి అన్నంపెట్టడం, పిల్లల్ని చక్కగా చూసుకోవడం, భర్తకి చేదోడువాదుడుగా ఉండడం చేయాలి. అబద్దాలు చెప్పకూడదు. భర్త తలదించుకునే పనులు అసలు చేయకూడదు. సమాజములో తలెత్తుకుని ఉండేలా చేయాలి. ఎక్కువ పోట్లాటలకు పోకూడదు.అన్ని విషయాల్లోనూ భర్త కి అనుగుణంగా, నచ్చింది చేస్తూ ఉంటే ఇప్పటుకన్నా మీ భర్త మీ మాటే వింటాడు...