ప్రతి మహిళ పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలానే పెళ్లి అయిన దగ్గర నుండి ప్రతి నెల  గర్భవతి అయిందో లేదో అన్న ఆలోచనలో ఉంటుంది. అయితే కొన్ని లక్షణాల వల్ల మనం గర్భవతి అవునో కాదో అన్న విషయాన్నీ తెలుసుకోవచ్చు. ప్రతి గర్భవతి మహిళకి ఉండే ఖచ్చితమైన లక్షణం రుతుక్రమం తప్పడం. కుటుంబ నియంత్రణ పద్దతులేమీ వాడక, రతిలో పాలుగొన్న నెల లో మీరు గనక నెలసరి తప్పితే, మీరు గర్భవతి అయ్యుండొచ్చు.గర్భధారణ జరిగిన వెంటనే హార్మోన్లు మార్పులు చెందుతూ బ్రెస్టులో మార్పులు వస్తాయి. అంటే రక్తనాళాలలో మార్పులు  మొదలై  స్తనాలు పెద్దగా, గుండ్రంగా  మారి చనుమొనలు ముదురు ఎర్ర రంగు లోకి మారతాయి.

 

పిరియడ్ తేదీ దాటాక స్తనాల్లోఇటువంటి మార్పులు వస్తే గర్భ ధారణ జరిగిందని గ్రహించ వచ్చు.ఏదో పని చేసి అలిసి పోవటం కాక, ఊరికే అలసట, నీరసం, నిద్రలేమి కలిగితే దాని కారణం తెలుసుకోవాలి.అప్పుడప్పుడు ఇతర అనారోగ్య కారణాల వల్ల కూడా నీరసం రావచ్చు . గర్భధారణ ముఖ్య లక్షణాల్లో ఒకటి వికారం లేదా వేవిళ్లు. నెల తప్పిన మొదటినుంచీ వికారము, ఏమి తిన్నా కడుపులో ఇమడక పోవటం, నోట్లో ఎక్కువ లాలాజలం ఊరటం, వాంతులు, లక్షణాలు కొంత మందికి కనిపించవచ్చు..

 

మొదటి సారి గర్భ ధారణ సమయంలో కొంచెం ఎక్కువ వికారంగా ఉంటుంది. ఎప్పుడు కంటే ఎక్కువగా టాయిలెట్టుకి వెళ్లాల్సి వస్తే గర్భధారణ జరిగి ఉండవచ్చని అనుకోవచ్చు. హార్మోన్ల మార్పులవల్ల రక్త ప్రసరణలో, మూత్ర నిల్వపై కూడా ప్రభావం చూపిస్తుంది. పెరుగుతున్న గర్భాశయం మూత్ర నాళాలపై, బ్లాడర్ పై వత్తిడిని కలుగ చేస్తోంది. దానివల్ల తరచుగా టాయిలెట్టుకి వెళ్లాల్సివస్తోంది. పిరియడ్లో లాగా కింది నడుము నొప్పి వస్తే అది గర్భ ధారణ సూచన కావచ్చు. కొందరికి రోజంతా నడుము నొప్పి బాధిస్తుంది. ఇంతకు ముందు చాలా ఇష్టం గా తినే పదార్ధాలు గర్భ ధారణ అయ్యాక అస్సలు సహించకపోవచ్చు  లేదా మరీ ఇంకా తినాలనిపించవచ్చు.అలాగే మరి కొన్ని అస్సలు సహించని, ఇష్టం లేని పదార్ధాలపై అతిగా ఇష్టం కలిగి, తినాలని అనిపించవచ్చు. 

 

వింతగా ఒక్కోసారి కొన్ని పదార్ధాల వాసన కూడా వికారం కలిగిస్తుంది.  గర్భధారణ వల్ల హార్మోన్లు చాలా  మార్పు చెందుతాయి. దానితో జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితమౌతుంది.రోజూ మలబద్ధకంతో అవస్థగా ఉంటే, గర్భధారణ జరిగి ఉండవచ్చు. మలబద్దకానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.గర్భధారణ వల్ల మూడ్స్ నిలకడగా లేక మారిపోతుంటాయి. హార్మోన్ల మార్పులు ఫలితంగా రకరకాల విసుగులు, కోపాలు, తొందరగా ఏడుపు రావటం, ఇలా అర్ధంకాని చికాకులకు లోనౌతారు. గర్భం గురించి ఇంకా   అని ఖచ్చితంగా తెలియాలి అంటే ఇంట్లో ప్రెగ్నన్సీ కిట్ వాడడం కానీ, ఆపత్రిలో రక్త పరీక్ష చేయించు కోవడం కాని చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: