సాధారణంగా ఆడవారిలో ప్రతి నెలా బాధించే సమస్య పీరియడ్స్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మహిళలు పీరియడ్స్ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా మానసికంగా మరియు శారీరకంగా మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనస్సు, శరీరం అలసినట్లు అనిపిస్తుంది. అలాగే పొట్ట ఉబ్బరం, క్రాంప్స్, బ్యాక్ పెయిన్, వికారం, అలసట, పొట్టనొప్పి వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే.. కొన్ని సందర్భాల్లో మహిళలు పీరియడ్స్‌ను పోస్ట్ పోన్ చేయాలనుకుంటారు.
అంటే వెడ్డింగ్ లేదా కొన్ని వెకేషన్స్ టైమ్‌లో పీరియడ్స్‌ను ఆలస్యం చేసుకోవాలనుకుంటారు. అలాంటి సమయంలో కొందరు పిల్స్ వాడుతుంటారు. కానీ, వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అలా కాకుండా న్యాచురల్‌గా కూడా పీరియడ్స్‌ను పోస్ట్ పోన్ చేయవచ్చు. అందులో ముందుగా.. పీరియడ్స్ కు రెండు లేదా మూడు వారాల ముందు నుండి ఫిజికల్ యాక్టివిటిస్‌ను పెంచడం వల్ల పీరియడ్స్ ఆలస్యం అవుతుంది. బరువు తగ్గడం వల్ల హార్మోన్స్ శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఇది పీరియడ్స్ ను డిలే చేస్తుంది. అలాగే స్పైసీ ఫుడ్స్, బాడీలో హీట్ కలిగించే ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
ఇవి శరీరంలో వేడిని పుట్టించడం వల్ల మెనుష్ట్రువల్ ప్లో పెంచుతుంది. అన్ని రకాల స్పైసీ ఫుడ్స్ ను తినడం మానేయాలి. ముఖ్యంగా పెప్పర్, బ్లాక్ పెప్పర్, అల్లం, వెల్లుల్లికి దూరంగా ఉంటే పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయవచ్చు. అదేవిధంగా, ధాన్యాలతో తయారుచేసిన సూప్ ను రోజూ ఒకవారం లేదా రెండు వారాల ముందు నుండి తీసుకోవం వల్ల పీరియడ్స్ ను డిలే అవుతుంది. సూప్ తయారుచేసుకోవడానికి ధాన్యాలను పొడి చేసి, నీటిలో మిక్స్ చేసి, సూప్ లా తయారుచేసి తాగాలి. ఇక ఒక బౌల్ నీటిలో పార్ల్సే ఆకులు వేసి ఉడికించాలి. తర్వాత వడగట్టి, గోరువెచ్చగా అయిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. ఇలా చేడయం వల్ల కూడా పీరియడ్స్ ను ఆలస్యం చేయవచ్చు.