సాధారణంగా మన దగ్గర ఉన్నవి  కొన్ని ఇతరులకు  పంచుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుందని చెబుతుంటారు. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటూ ఇంగ్లిష్ లోనూ మంచి నానుడి ఉంది.  కొన్ని రకాల ఉత్పత్తులను మాత్రం ఎవరితోనూ అస్సలు షేర్ చేసుకోకూడదట.  బ్యూటీ ఉత్పత్తులు మాత్రమే కాదు.. మనం రోజూ వాడే వస్తువులు కూడా ఇందులో చాలా ఉన్నాయి. మరి అవేంటో.. ఆ ఉత్పత్తులు ఎందుకు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం రండి.

 

 

మన టవల్ కేవలం మనం మాత్రమే ఉపయోగించాలట. ఇతరులు దాన్ని ముట్టుకోకూడదని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఇద్దరు వ్యక్తులుంటే రెండు టవల్స్ వాడాలే కానీ ఇద్దరూ ఒకేదాన్ని షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా హాస్టళ్లో ఉన్నవారు ఇలా షేర్ చేసుకోవడం కనిపిస్తుంది. కానీ దీని వల్ల మన చర్మానికి ఎంతో హాని జరుగుతుంది. ప్రతి ఒక్కరి చర్మ తత్వం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి చర్మంపై సమస్యలు వేరుగా ఉంటాయి. ఒకవేళ మీ చర్మం సెన్సిటివ్ అయితే ఇలా టవల్ షేర్ చేసుకోవడం వల్ల ఇతరుల చర్మ సమస్యలు కూడా మీకు వచ్చే ప్రమాదం ఉంటుంది.చర్మం లాగే ప్రతి ఒక్కరి తలలో చర్మం జుట్టు సమస్యలు కూడా వేరుగా ఉంటాయి. మీరు వాడిన దువ్వెన మరొకరు వాడడం లేదా వారు వాడినది మీరు షేర్ చేసుకోవడం వల్ల దువ్వెన ద్వారా హెయిర్ సమస్యలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

 

 

చాలాసార్లు మన తలలో ఉన్న స్కాల్ప్ సమస్యలకు ఇతరుల దువ్వెన ఉపయోగించడం మాత్రమే కారణం కావచ్చు. అందుకే ప్రతి ఒక్కరికీ ఒక దువ్వెన ఉంచుకోవడంతో పాటు దాన్ని తరచూ శుభ్రం చేయడం వల్ల కూడా జుట్టు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. లిప్ గ్లాస్ ని కూడా ఎవరూ ఇతరులతో షేర్ చేసుకోకూడదు. మన చర్మం పై అత్యంత సున్నితమైన ప్రాంతం మన పెదాలు. ప్రతి ఒక్కరి చర్మ సమస్యల్లాగే పెదాల సమస్యలు కూడా వేరుగా ఉంటాయి.ఇలాంటప్పుడు దాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు కూడా షేర్ అవుతాయి. అంతేకాదు

 

 

ఆరోగ్యకరమైన, అందమైన కళ్లు చూసేందుకు ఎంతో అందంగా ఉండడం మాత్రమే కాదు.. కళ్లు చాలా సున్నితమైన భాగాలు. వాటి వెంట్రుకలకే మనం మస్కారా రాస్తాం. ఈ మస్కారా వల్ల మన కళ్లకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం దాన్ని షేర్ చేసుకోకుండా ఉండాలి.త్రెడింగ్ వంటివి చేసినా.. ఎక్కువగా ఉన్న వెంట్రుకలను తొలగించేందుకు మనం ప్లక్కర్ ని ఉపయోగిస్తాం. చాలామంది కేవలం కనుబొమ్మలు మాత్రమే కాదు. చంకలు, బికినీ లైన్ వంటి ప్రాంతాల్లో కూడా వెంట్రుకలను తొలగించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇలా వెంట్రుకలను లాగేటప్పుడు కొన్ని సార్లు రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అది ప్లక్కర్ కి కూడా అంటుకొని ఆ రక్తం నుంచి ఏవైనా ఇన్ఫెక్షన్లు మీకు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్లక్కర్ ని షేర్ చేసుకోవడం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: