ఈ మధ్య చాలామందిని వేధించే ఒకే ఒక్క సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల ఆడవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జీన్స్ వేడుకుందామన్న, మోడరన్ డ్రెస్ లు వేసుకుందాము అన్నాగాని అధిక బరువు వల్ల చాలా మంది కొంచెం సంకోచిస్తారు. అందుకే అందరు సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు. అందుకే అధిక బరువును నియంత్రించడానికి  ఈ ఒక్క పప్పు ఎంతో మేలు చేస్తుంది. ఆడవాళ్లు ఏవ్వరైన కానీ  అనుకోకుండా పెరిగిన బరువుని  వాళ్ళు వ్యాయామంతో తగ్గించుకోవడానికి,  ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు.

 

 

అలాంటి వాళ్లకి బాదం  మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. బరువుని తగ్గించడంలో బాదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బాదం పలుకుల్ని తింటే పిండిపదార్ధాలు  ఎక్కువగా ఉండే పదార్థాలను  తినాలన్న ఆసక్తి తగ్గుతుంది అంట. దీనివల్ల వేరే ఆహారపదార్ధాల వాడకం అనేది తగ్గుతుంది. 
 ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్రేట్స్ వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. అలాగే శరీరంలో  కొత్తగా కొవ్వు  కూడా పట్టదు .

 

 

 

 

బాదాం పప్పులు తినడం వల్ల ఒక్క బరువు అనే కాదు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కనుక  రెండు రోజులకోసారి గుప్పెడు బాదం గింజల్ని తింటూ ఉండాలి. వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిన్, బయోటిన్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దానివల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ బరువుని మించి ఉన్నవారు బరువు తగ్గడానికి బదం పలుకుల్ని వినియోగించుకోవచ్చు.కనీసం రోజుకు మూడు బాదాం పప్పులను అయినా రాత్రి నానపెట్టుకుని ఉదయాన్ని తింటే అధిక బరువును తగ్గించుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: