కవల పిల్లలు అంటే తల్లి గర్భములో ఒకేసారి ఇద్దరి పిల్లలు పెరగడం అన్నమాట. అలాగే ఒకేసారి ఇద్దరి బిడ్డలకు జన్మనివ్వడం. కానీ ఇలా కవల పిల్లలు అందరికి పుట్టరు.. ఎక్కడో ఒకచోట చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కొంతమంది కవల పిల్లలు కావాలని కోరుకుంటారు. అయితే కవలపిల్లలు ఎటువంటి మహిళలకు ఎక్కువగా పుట్టే అవకాశాలు ఉన్నాయో చూడండీ.. మహిళల వయసు 35 దాటిన తర్వాత పిల్లలను కనాలనుకునేవారికి కవలలు పుట్టే చాన్స్ ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే.. 35 సంవత్సరాలు దాటిన వారిలో విడుదలయ్యే అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుందట. అంతే కాదు.. వారికి రెండు అండాలు విడుదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట..
బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉండే మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట.చాలా రోజుల పాటు పిల్లలు పుట్టకుండా రకరకాల పద్ధతులు పాటించిన వాళ్లు.. ఒకేసారి వాటిని ఆపేసి పిల్లల కోసం ప్లాన్ చేస్తే అండాలు రెండు కానీ అంత కంటే ఎక్కువ విడుదల అవుతాయట. అటువంటి వాళ్లకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంటుందట.ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే మహిళల్లో, మల్టి విటమిన్ టాబ్లెట్లను అధికంగా వేసుకునే వారిలో.. డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే మహిళలకు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.పాలతోపాటు వెన్న, చీజ్, ఇతర పాల పదార్ధాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల కవలల గర్భధారణ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పాలలో ఎదుగుదలకు అవసరమైన ఇన్సులిన్ ఉండడం వల్ల, పాల పదార్ధాలు తీసుకుంటే సహజంగా కవలలను గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.వయసుతో కూడిన నిబంధనల వల్ల ఒకసారి మాత్రమే ఆమె గర్భం పొందగలదు అనుకున్నపుడు రెండుసార్లు గర్భం దాల్చడం కంటే ఒకేసారి కవలలకు జన్మనివ్వడం ఉత్తమం ..!!