అమ్మ అయ్యాక ప్రతి తల్లి ముందుగా ఎదుర్కునే సమస్య బిడ్డకి సరిపడా పాలు లేవని. కొంతమంది బాలింతల్లో సరిపడినన్ని పాలు ఉండవు.బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. బిడ్డ శారీరక మానసిక ఎదుగుదలకి కావాల్సినవన్నీ తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. తల్లిపాలు బిడ్డని అనేక ఇన్‌ఫెక్షన్స్, ఎలర్జీలు, అస్థ్మా, మరీ ముఖ్యం గా జలుబు నుంచి రక్షిస్తాయి. అందుకనే బిడ్డకి ఆరు నెలలు నిండే వరకూ తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది.అందుకనే పాలు పడడానికి సహకరించే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యని తేలికగా అధిగమించవచ్చు.
అయితే, తల్లులకి సరిపడా పాలు పడాలంటే కొన్ని ఆహారపదార్థాలు తసుకోవాలి.. అవేంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ తినడం వల్ల తల్లిపాల క్వాంటిటీనీ, క్వాలిటీనీ కూడా మెరుగుపరుస్తాయి.ప్రసవ సమయంలో చాలా రక్తం అనేది పోతుంది.దాన్నించి రక్తహీనత వస్తుంది. అయితే ఈ ఓట్స్ తినడం వల్ల ఎనీమియా రాకుండా చేస్తాయి. ఓట్స్‌ని మామూలుగా పాలల్లో వేసుకుని అలాగే తినొచ్చు. కావాలనుకుంటే తేనె, ఏమైనా నట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ కలిపి కూడా తినొచ్చు. ఓట్స్ బిస్కెట్స్ కూడా తినచ్చు. పప్పూ, జీడి పప్పూ, వాల్ నట్స్ వంటిని పాలిచ్చే తల్లులకి బాగా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్స్ తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. పైగా వీటి ద్వారా కాల్షియం కూడా లభిస్తుంది. రాత్రికి నానబెట్టి తొక్క తీసేసిన బాదంపప్పులు రోజుకి ఐదారు తీసుకోవచ్చు. వీటిని రాత్రి నానబెట్టి పొద్దున్నే తీసుకోవచ్చు.కోనట్ ఆయిల్ గర్భవతులకీ, బాలింతలకీ కూడా మంచిది.
ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ పాలు పడడానికి సహకరిస్తాయి. ఈ ఆయిల్ ఇమ్యూనిటీ ని కూడా పెంచుతుంది. పాలిచ్చే తల్లులు రోజుకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయినా తీసుకుంటే మంచిది. ఈ ఆయిల్ ని సలాడ్ డ్రెసింగ్స్‌లో అయినా వాడొచ్చు.తల్లి ఎంత విటమిన్ 'సి ' తీసుకుంటే తల్లి పాలలో అంత విటమిన్ "సి " ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు బాగా తినాలి. కమలాపండు లో విటమిన్ సీతో పాటూ విటమిన్ ఏ, విటమిన్ బీ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. బిడ్డకి పాలిస్తున్నంత కాలం తల్లి రోజుకి రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగచ్చు.పాలు పెరగడానికి ఉపకరించే మిగతా ఆహారపదార్ధాల గూర్చి తర్వాత తెలుసుకుందాం... !!