
సాధారణంగా మహిళలకు పొడవు జుట్టు అంటే ఎక్కువ మందికి ఇష్టం. ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యకరమైన మరియు షైనీ హెయిర్ ను కోరుకుంటుంది.మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, రెగ్యులర్ మెయింటైనెన్స్ చాలా అవసరం. రెగ్యులర్ గా జుట్టుకు సరిగా నూనె పెట్టుకోవడం, జుట్టు తత్వాన్ని బట్టి మన్నికైన షాంపును ఉపయోగించడం, కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోవడం ఇవన్నీ కూడా ఆరోగ్యకరమై జుట్టు సంరక్షణలో భాగాలే.. మరో ముఖ్యమైన విషయం హెయిర్ బ్రషింగ్ . కొందరి అభిప్రాయం ప్రకారం జుట్టును దువ్వడం హాని కలుగుతుందని అనుకుంటారు, కానీ హెయిర్ ను సరిగా బ్రష్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. జుట్టును సరిగా దువ్వడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తలను ఎప్పుడు దువ్విన గాని నుదురును తాకే విధంగా దువ్వెనతో దువ్వాలి. ఇలా తలలోపలి నుండి తలదువ్వడం వల్ల తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్ తల మొత్తం ప్రసరణ జరగడానికి సహాయపడుతుంది. హెయిర్ బ్రెషింగ్ చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుంది. రెగ్యులర్ గా హెయిర్ బ్రెష్ చేయడం వల్ల జుట్టు, కేశాలు శుభ్రపడుతాయి . ఇలా దువ్వుకోవడం వల్ల జుట్టు మరియు తలమీద ఉన్న మురికి తొలగింపబడుతుంది . రెగ్యులర్ గా తల దువ్వడం వల్ల తలలో ఉన్న చుండ్రు తొలగిపోవడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ గా జుట్టును దువ్వడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగుతుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టు పెరుగుదలకు సహాయపడే ఫోలీ కిల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును రెగ్యులర్ గా దువ్వడం వల్ల మీ జుట్టు యొక్క క్వాలిటీ పెరుగుతుంది. జుట్టు నాణ్యత మంచి షైనింగ్ తో మరియు స్ట్రాంగ్ గా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. జుట్టును రెగ్యులర్ గా దువ్వడం వల్ల హెయిర్ ఫోలికిల్స్ యాక్టివేట్ అవుతుంది. దాంతో పాటు కొత్త జుట్టుకు అవసరం అయ్యే ఫోలికిల్స్ పెరుగుతాయి. కాబట్టి, హెయిర్ బ్రష్ మంచి క్వాలిటీ ఉన్న దాన్ని కొనుగోలు చేయాలి. మరో ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్ రెగ్యులర్ గా తల దువ్వడం వల్ల ముడులు, చిక్కులేకుండా తొలగిస్తుంది. అప్పుడు చూడడానికి జుట్టు మరింత అందంగా కనపడుతుంది. జుట్టును సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ఉంచుతుంది.దువ్వేటప్పుడు కూడా చాలా స్మూత్ గా దువ్వాలి. ఎలా పడితే అలా దువ్వితే జుట్టు ఊడిపోతుంది లేదంటే సగంలోకి కట్ అయిపోతుంది.ఎవరి దువ్వెన వాళ్ళకి సెపరేట్ గా ఉంటే మరి మంచిది...