సాధార‌ణంగా పెళ్లైన ప్రతి మహిళ తాను గ‌ర్భ‌వ‌తిని కావాల‌ని కోరుకుంటుంది. ఎందుకంటే.. త‌ల్లి అవ్వ‌డం అనేది ఆడ‌వారికి గొప్ప వ‌రం. ఇక గర్భం దాల్చిన తర్వాత ఆరోగ్యంపై ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే.. మీతో పాటు మీ కడుపులో ఇంకో బిడ్డకు మీరు జన్మను ఇస్తున్నారు కాబ‌ట్టి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో గుర‌క పెట్ట‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుంది..? అన్న‌దానిపై అధ్య‌య‌నం చేయ‌గా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

 

గురక.. ఇది సాధారణమైన సమస్య అయిన‌ప్ప‌టికీ.. చాలా ఇబ్బంది పెడుతోంది. గురక అలవాటు ఉంటే.. దాన్ని వదిలించుకోవడం కూడా చాలా కష్టం అనే చెప్పాలి. నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది. దీని వ‌ల్ల ప‌క్క‌న‌వారు చాలా ఇబ్బంది ప‌డ‌తారు. వారికి ఒక వైపు నిద్ర రాదు, ఆ శబ్దానికి ఎం చేయాలో అర్ధం కాదు. అయితే సాధార‌ణ వ్య‌క్తుల గురించి ప‌క్క‌న పెడితే.. గ‌ర్భ‌వ‌తులు గురక పెట్టడమనేది శిశువు ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు.

 

ఇటీవ‌ల జ‌రిపిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. వారానికి మూడు రాత్రుల కంటే ఎక్కువగా గురకపెట్టే తల్లుల్లో డెల‌వ‌రీ టైమ్‌లో ప్రమాదాలు ఎక్కువ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ ఫలితాలలో సి సెక్షన్ జననాలు, బరువు తక్కువగా లేదా నెలలు నిండకుండా శిశువులను ప్రసవించడం వంటివి కూడా జ‌రుగుతాయ‌ట‌. అలాగే గురక కారణంగా మావికి వెళ్ళే రక్తనాళాల మీద ప్రభావం చూపి, తక్కువ రక్త ప్రవాహానికి దారితీస్తుంది. త‌ద్వారా శిశువుకు పోషకాలు సరిగ్గా అందకుండా చేస్తుంది. దాంతో శిశువు ఎదుగుదల మీద ప్రభావం పడుతుంద‌ని అంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మీరు ఉంటే.. ఎలాంటి భ‌యం లేకుండా.. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: