మన దేశంలో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలకు ప్రాధాన్యత ఇస్తారు ..అయితే బంగారంతో పాటు వెండిని కూడా ఉపయోగిస్తారు .అలాగే  బంగారం త‌ర్వాత లోహాల్లో వెండికే డిమాండ్ ఎక్కువ‌ ఉంటుంది. బంగారంతో పోలిస్తే వెండి ధర కూడా  తక్కువే.మన ఆడవాళ్లు సంప్రదాయంలో భాగంగా వెండిని కాళ్లకు పట్టీల రూపంలో, ఉంగరాల రూపంలో, ఇంట్లో దేవుని సామాన్లకు, మెట్టెలు రూపంలో ఉపయోగిస్తారు. అసలు ఈ వెండి ధరించడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

 

 

 

 

వెండి తేలికైన లోహం  ఎక్కువ కాలం పాటు ధ‌రించ‌డానికి ఎంతో సౌక‌ర్యంగా, సులువుగా ఉంటుంది. వెండి ఆభ‌ర‌ణాలు ప్ర‌తి క‌ల‌ర్ దుస్తుల‌పై న‌ప్పుతాయి. బంగారు ఆభ‌ర‌ణాలు అలా కావు. బంగారం ప‌సుపు రంగులో ఉంటుంది కాబ‌ట్టి అంద‌రికీ సూట్ కాదు. వెండి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం ఆరోగ్య‌క‌రం కూడా. శ‌రీరంలో వివిధ భాగాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంలో వెండి కీల‌క పాత్ర పోషిస్తుంది.ఆడవాళ్లు  వెండిని ఆభరణంగా ధరించడం ఎంతో శుభపరిణామంగా భావించాలి. ముఖ్యంగా మన చేతి వేళ్ళలో చిటికెన వేలుకు వెండితో చేసిన ఉంగరాన్ని ధరస్తే ఎంతో మంచిది. దీని కారణంగా మానసికంగా బలహీనంగా ఉండే వ్యక్తులు ఊరట పొందుతారు.

 

 

 

వెండితో తయారు చేసిన గొలుసు మెడలో ధరిస్తే మీకు మంచి జరుగుతుంది.  అంతేకాకుండా మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.  వెండి గ్లాసు లేదా గిన్నెలో నీరు తాగితే జలుబుతో పాటు శీతల సమస్యలు రాకుండా ఉంటాయి.అందుకనే మన పెద్ద వాళ్ళు చిన్నపిల్లలకు అన్నప్రాసన సమయంలో వెండి గిన్నె, వెండి గ్లాసు తీసుకుని అందులో పిల్లలకు అన్నం పెడతారు. అలా చేస్తే మంచిదని ఆ సంప్రదాయాన్ని వాడుకలోకి తెచ్చారు.  స్వచ్ఛమైన తేనేను వెండి గిన్నే లేదా చెంచాతో తీసుకుంటే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం సోమవారం రోజు వెండితో పాటు పాలు, పెరగు, నెయ్యి, తేనే, చక్కెరతో చేసిన శంకరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేస్తే శరీరంలోని అన్ని వ్యాధులు తొలుగుతాయి. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలిగి పోతాయి అన్ని నమ్మకం..

మరింత సమాచారం తెలుసుకోండి: