బంగాళాదుంపలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి. బంగాళదుంప సాయంతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. బంగాళా దుంపను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవాలని కోరుకునే వారికోసం ఇప్పుడు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..పచ్చి బంగాళా దుంప గుజ్జును గ్లాసు నీళ్ళలో వేసి నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు మరిగించాలి. నీళ్లు ఆవిరి అయినా తర్వాత మిగిలిన గుజ్జును ముఖానికి రాసుకుంటే ముఖం మీద ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.కనీసం వారానికి ఒకసారి అయిన ఇలా చేస్తే మీ ముఖం మీద మచ్చలు తగ్గు ముఖం పడతాయి.
బంగాళా దుంప చర్మాన్ని మెరిపిస్తుంది. బంగాళా దుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కంటి కింద నల్లటి వలయాలు క్రమంగా తగ్గుతాయి. దీని ద్వారా చర్మానికి తగినంత పోషణ లభించి కొత్త కాంతిని సంతరించుకుంటుంది. అలాగే బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు. మీ కళ్ళ కింద వలయాలు పోతాయి .
ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును రోజూ రాత్రిపూట పడుకోబోయే సమయంలో ముఖానికి రాసి ఉదయాన్నే కడిగితే చర్మం మీది తెగిన, కాలిన గాయాలు, మొటిమలు మటుమాయం అవుతాయి.ఉడికించిన రెండు బంగాళ దుంపల గుజ్జుకు రెండు చెంచాల పాలు కలిపి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి గోరువెచ్చగా వుండగానే ముఖానికి రాసుకుని అరగంట పాటు ముఖాన్ని ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగి,కొంచెం పాల మీద మీగడ రాసి పది నిమిషాల తర్వాత మరోమారు కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది..పైన చెప్పిన విధంగా బంగాళాదుంపను ఉపయోగించి అందాన్ని పెంచుకోండి.